పల్లె ప్రగతితో తెలంగాణ అగ్రపథం -అవార్డులే అవార్డులు..!!

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యాక్రమానికి అంకురార్పణ చేసారు. ఈ నిర్ణయంతో పల్లెల రూపు రేఖలే మారిపోయాయి. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో మొత్తం రూ. 13,528 కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ ను సాధించింది. తెలంగాణ‌ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో, సిఎం కేసిఆర్ నాయకత్వంలో, దశాబ్ది స్వీయ పాలనలో కొత్త స్వరం పురివిప్పుకుంది. ''పల్లే పచ్చగా మారింది స్వయం పాలనలోనా...నా తల్లి సంబరపడుతోంది పల్లెప్రగతి పథాన'' అని జానపదం పాడుకుంటోంది. ప్రతి ఊరుకు హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, వైకుంఠధామాలు, క్రీడా స్థలాలు, పల్లె దవాఖానాలు, మిషన్ భగీరథ నీళ్లు, 24 గంటల విద్యుత్ తో వెలుగుల వాకిల్లుగా తెలంగాణ పల్లెలు పటిష్ఠం అయ్యాయి. గ్రామాలు స్వయం సమృద్ధితో ఎదిగాయి. దశాబ్ది ఉత్సవం వేళ కొత్త ఉత్సాహంతో నిండాయి. ఈ పథకం కింద ఖరారు చేసిన కార్యక్రమాల కోసం రూ. 13,528 కోట్లను ఖర్చు చేశారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను ఏర్పాటుతోపాటు 12745 గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు వచ్చాయి.

 kcr

గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ ను సాధించింది. న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ‌ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్ఏలతోపాటు, 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రక్రియ కొనసాగుతున్నది. 2022-23లో ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.256 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ప‌ల్లె దవాఖానాలతో గ్రామంలో ఆరోగ్యం పదిలం కావ‌డానికి ఒక్కో పల్లె దవాఖానకు రూ. 20 లక్షల వ్యయంతో పక్కా భవనాలు నిర్మిస్తున్న‌ది.

ప్రతి భవనంలో మూడు బెడ్లతో కూడిన వార్డు రూం, ఒక వెయిటింగ్‌ హాల్‌, స్టోరేజీ గది, ఒక నర్సింగ్‌ గది, ల్యాబ్‌, రెండు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తుంది. రోగులను వీల్‌చైర్‌లో తరలించేందుకు ర్యాంప్‌ కూడా నిర్మిస్తుంది. మిషన్ భగీరథ నీటితో పల్లెటూళ్లు స్వచ్ఛమైన తాగునీటి ఆవాసాలుగా మారాయి. హైద‌రాబాద్ మ‌హానగ‌రంతోపాటు, శివారు ప్రాంతాల‌కూ ఈ ప‌థ‌కం ద్వారా తాగునీరు అందుతోంది.

kcr

రూ.506 కోట్లతో మెరుగైన విద్యుత్ పంపీణి నెట్‌వర్క్‌ పునరుద్దరణ ద్వారా తెలంగాణ పల్లెలు వెలుగుల వాకిల్లుగా మారాయి. కేంద్రం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణకు దక్కాయి. ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా అవార్డులు రాష్ట్రం సొంతం అయ్యాయి.

తెలంగాణకు వచ్చిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ 2019 లో తెలంగాణ - రెండో స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ) పెద్దపల్లి జిల్లా తొలి స్థానం (జిల్లాల క్యాటగిరీ)కి దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ 2019 కింద తెలంగాణ - రెండో స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ)లో నిలిచింది. గందగీ ముక్త్‌ భారత్‌ 2020 కింద తెలంగాణ తొలి స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ)లో దక్కించుకుంది. కరీంనగర్‌ జిల్లా - మూడో స్థానం (జిల్లాల కేటగిరీ )సిద్దిపేట జిల్లా - ఉత్తమ ప్రదర్శన జిల్లాగా దక్కించుకుంది.

ఈ-పురస్కార్‌ అవార్డు 2021:తెలంగాణ తొలి స్థానం (క్యాటగిరీ-2) దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్‌ అవార్డు-2021 దక్కింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయి. పొట్ట కూటికోసం వలస వెళ్లిన పల్లెజీవులు సొంతూరుకు వచ్చి సంతోషంగా పనిచేసుకుంటున్నరు. స్వచ్ఛమైన తాగునీటితో, నిండిన చెరువులతో, కాళేశ్వరం సాగునీటితో, పచ్చని పంట పొలాలతో, పరిశుభ్రత వాతావరణంతో పల్లె మళ్లీ వికసించింది. దశాబ్ది ఉత్సవాలను దర్జాగా నిర్వహించుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+