వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ బరిలో సర్వే, కాంగ్రెస్‌పై రాజయ్య ఎఫెక్ట్!: సారిక మృతిపై సోదరి అర్చన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/వరంగల్: సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన ఘోర విషాదం పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు స్పందించారు. రాజయ్య కోడలు, మనవళ్లు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన ఖాళీ బీఫారంతో వరంగల్ బయలుదేరారు.

తాము అభ్యర్థిని మారుస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. అయితే ఎవరిని బరిలో దింపాలనే విషయం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. వరంగల్ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సర్వే సత్యనారాయణను కోరుతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీపై రాజయ్య ఎఫెక్ట్!

వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజయ్య కోడలు, పిల్లలు మృతి కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందని భావిస్తున్నారు. రాజయ్య పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ... ఎవరు పోటీ చేసినా ఆ పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ ఎపెక్ట్ పడుతుందని అంటున్నారు.

సారిక మృతిపై అనుమానాలున్నాయి: సోదరి అర్చన

హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభినవ్‌(7), అమోన్‌(3), శ్రీయోన్‌(3)లు మృతి చెందారు. ఘటనపై సారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి అర్చన తెలిపారు. సారిక మృతిపై అనుమానాలున్నాయన్నారు.

 Unfortunate: Uttam Kumar on fire and dead at Rajaiah's house incident

గ్యాస్‌ లీకేజీ వల్లే అగ్ని ప్రమాదం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. సారిక బెడ్‌రూమ్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదవశాత్తూ లీకేజీ కావడంతోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రత్యేక క్లూస్‌ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉందని వెల్లడించారు. సాంకేతికంగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

రాజయ్య ఇంటి ముందు మహిళా సంఘాల ధర్నా

రాజయ్య నివాసం ముందు మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. రాజయ్య తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. భార్యను వదిలి వేరే కాపురం పెట్టిన సారిక భర్త అనిల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వరంగల్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ

రాజయ్య ఇంట్లో విషాదం నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఆయనను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. దీంతో, నామినేషన్ వేసేందుకు సర్వే వరంగల్
బయలుదేరారు.

English summary
In a tragic incident, Congress former MP and present candidate for Warangal MP bypolls Siriclla Rajaiah's daughter-in-law and three grandsons have been burnt alive under suspicious circumstances at their house in Revenue Colony in Warangal city in the wee hours of Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X