కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దు..!?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.షెడ్యూల్ ప్రకారం ఈ అర్దరాత్రి అమిత్ షా హైదారాబాద్ రావాల్సి ఉంది. రేపు (గురువారం) నగరంలో నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని ఖమ్మంలో జరిగే పార్టీ సభకు హాజరు కావాల్సి ఉంది. ఖమ్మం సభను బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బిపర్జాయ్ తుఫాను తీరం దాటనుండటంతో హోం శాఖ మంత్రిగా తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించాల్సి ఉన్న కారణంగా పర్యటన రద్దు అయినట్లు పార్టీ నేతలకు సమాచారం అందుతోంది.
షా పర్యటనపై సస్పెన్స్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు సమాచారం అందుతోంది. బిపర్జాయ్ తుఫాను గుజరాత్‌లోని జఖౌ వద్ద రేపు సాయంత్రం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రధాని ఈ తుఫాను సంసిద్దత మీద సమీక్ష నిర్వహించారు.
హోం శాఖ మంత్రిగా అమిత్ షా ప్రభావిత రాష్ట్రాలను అప్రమత్తం చేసారు. సహాయక చర్యల పైన ముందస్తు సూచనలు చేసారు. తుఫాను తీరం దాటుతున్న సమయంలో హోం శాఖ మంత్రి అమిత్ షా అవసరమైన చర్యల కోసం అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. గుజరాత్, మహారాష్ట్ర పైన ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడింది.

తుఫాను వేళ అప్రమత్తం : తుఫాన్ ప్రభావంతో గుజరాత్, కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా.. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కఛ్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే.. తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తీవ్రత పెరుగుతోంది.
అయితే, తీర ప్రాంతాల్లో వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంతాలకు చెందిన 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తుఫాన్ కారణంగా 69 రైళ్లు రద్దయ్యాయి. మరో 58రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.
తుఫాను సహాయక చర్చల్లో అమిత్ షా : ఇటు హైదరాబాద్ కు రావాల్సి ఉన్న అమిత్ షా దర్శకుడు రాజమౌళి నివాసానికి వెళ్లాలని నిర్ణయించారు. అదే విధంగా పార్టీ నేతలతోనూ సమావేశం కావాల్సి ఉంది. ఇప్పుడు తుఫాను కారణంగా పర్యటన రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చే అవకాశం లేకపోయినా..ఖమ్మం సభకు అయినా హాజరు కావాలంటూ తెలంగాణ బీజేపీ నేతలు లేఖ రాసారు.
అయితే తుఫాను తీవ్రత తగ్గితే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అమిత్ షా సభ కోసం ఖమ్మంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలో కొనసాగుతున్న పరిణామాల సమయంలో షా పర్యటన ద్వారా స్పష్టత వస్తుందని అంచనా వేసారు. ఇప్పుడు అసలు అమిత్ షా పర్యటన రద్దు సమాచారం అందటంతో అధికారికంగా నిర్దారించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications