ఆర్ఆర్ఆర్ టీం తో అమిత్ షా సమావేశం - ఎన్నికల వేళ..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణకు వస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అమిత్ షా చేవెళ్ల వేదికగా జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీంతో సమావేశం కానున్నారు. గతంలో మునుగోడులో సభ కోసం వచ్చిన సమయంలో జూ ఎన్టీఆర్ ను కలిసిన షా..ఢిల్లీ వేదికగా చిరంజీవి, రాం చరణ్ తో సమావేవమయ్యారు. ఇప్పుడు మరోసారి టీం ను షా కలవనున్నారు.

తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే పార్టీలో ముఖ్య చేరికలు ఉంటాయని చెబుతున్నారు. చేవెళ్ల సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న వెంటనే 23వ తేదీ సాయంత్రం నోవాటెల్ హోటల్ లో అమిత్ షా ఆర్ఆర్ఆర్ టీంతో సమావేశం కానున్నారు. టీం ను అమిత్ షా కార్యాలయం నుంచి తేనేటి విందుకు ఆహ్వానిస్తూ సమాచారం పంపారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన హీరో జూ ఎన్టీఆర్ తో ఇదే నోవాటెల్ హటల్ లో అమిత్ షా డిన్నర్ కు ఆహ్వానించారు. సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఇది రాజకీయ సమావేశమే అని బీజేపీ నేతలు స్పష్టం చేసారు. జూ ఎన్టీఆర్ మాత్రం ఆ సమావేశం గురించి స్పందించ లేదు.

amitrrrteam

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అందుకున్న తరువాత రాంచరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి ఢిల్లీలో అమిత్ షాను కలిసారు. ఆ సమయంలో షా వారిద్దరినీ అభినందించారు. ఇప్పుడు హైదరాబాద్ వస్తున్న అమిత్ షా టీం మొత్తాన్ని ఆహ్వానించారు. మరోసారి జూ ఎన్టీఆర్ ,రాం చరణ్, దర్శకుడు రాజమైళి, కీరవాణి, చంద్రబోస్ తో పాటుగా మరి కొందరు పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ కర్ణాటక ఎన్నికల పైన ఫోకస్ చేసింది. పలువురు సినీ హీరోలు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలోనూ జూ ఎన్టీఆర్, మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల బిజీలో ఉన్న వేళ ఆర్ఆర్ఆర్ టీంతో ప్రత్యేకంగా అమిత్ షా భేటీ కావటం రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+