మెదక్ అల్లర్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ఆదేశాలు

మెదక్ అల్లర్ల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమయాకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టొద్దని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

Union Minister Bandi Sanjay responded on Medak Riots

మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్‌ పోలీసులకు సూచించారు.

కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం రాత్రి మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న పరిణమాలపై ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు.

కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ఎలాంటి మత కల్లోలాలు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేవని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ మత కల్లోలాలు లేని ప్రశాంత పట్టణమైన మెదక్​‌లో ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి మెదక్ పట్టణంలో ఓ వర్గం వారు గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందటంతో, మరో వర్గం వారు పట్టణ శివారులోని బంగ్లా చెరువు సమీపంలో, నర్శిఖేడ్‌లో అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+