Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరీంనగర్ లో బీజేపీది చారిత్రాత్మక విజయం.. నెక్స్ట్ టార్గెట్ అదేనన్న బండి సంజయ్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణలో బిజెపి తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగురవేయడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో హైదరాబాద్లో కూడా కాషాయం జండా ఎగురవేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ విజయం చారిత్రాత్మకం

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీకి మద్దతు ఇచ్చారని చెప్పారు. ఈ ఎన్నికలలో తమను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేశాయని, డబ్బు పంపిణీ జరిగిందని, ఓటుకు ఏడు వేల రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపించారు.

Union Minister Bandi Sanjay sensational comments on ghmc after the victory in karimnagar corporation

ఓవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసి ముక్కలు

అయినా వాటిని ప్రజలు తిరస్కరించి బిజెపికి పట్టం కట్టారన్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన, అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసి ముక్కలు చేశారని వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ పైన కాషాయ జెండా ఎగురవేసి గట్టి దెబ్బ కొడతామన్నారు.

రేవంత్ రెడ్డికి అదే మరణ శాసనం

హైదరాబాదులో రేవంత్ రెడ్డి చేసిన పని ఆయనకు మరణశాసనం కాబోతుందన్నారు. కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బి ఆర్ ఎస్ కు కన్ను కొడుతున్న ఎంఐఎం చెంప చెళ్ళుమనిపించారని బండి సంజయ్ అన్నారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ బలమైన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి 33 స్థానాలు గెలుచుకుందని, మరికొన్ని తక్కువ తేడాతో కోల్పోయిందని వెల్లడించారు. ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్ లోనూ కాషాయ జెండా ఎగరేస్తాం

కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ స్పూర్తితో హైదరాబాద్‌లోనూ కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు.మోదీపై నమ్మకంతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయం తనకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు.

ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం

ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం చేస్తున్నానని బండి సంజయ్ చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా కరీంనగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకువెళతానని ఆయన అన్నారు. కరీంనగర్లో బీజేపీ విజయంతో కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్ ను భుజం పైకి ఎత్తుకొని కాషాయ దళం ఊరేగింపు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+