రేవంత్ రెడ్డికా? కిషన్ రెడ్డికా?.. మోడీ బిగ్ ప్లాన్!
హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం రూ.26వేల కోట్లు కేటాయించనుంది. ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల అనేక పరిశ్రమలు రావడంతోపాటు వేలమందికి ఉపాధి దొరుకుతుంది. దీనికి అనుబంధంగా రీజనల్ రింగ్ రైల్ కూడా రానుంది. ఊహించనిరీతిలో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇది మొత్తం 338 కిలోమీటర్ల ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు.
అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను రూ.760 కోట్లతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ను ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు 40 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్‌నగర్ మీదగా వెళుతుంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ ను రెండు భాగాలుగా నిర్మించబోతోంది. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించిన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. భారతమాల పథకం ఫేజ్-I క్రింద సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్ గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ మంజూరైంది. దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్-ఆమనగల్లు-షాద్‌నగర్-సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
యుటిలిటీస్ ఛార్జీలు భరించేందుకు తాము సిద్ధమన్నారు. వీటిని భరించేందుకు కేంద్రం సిద్ధం కావడంతో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఇన్ని నిధుల కేటాయింపు అనేది కిషన్ రెడ్డి కోసం, బీజేపీ కోసం అన్నట్లుగా లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం కేటాయించినట్లుగా ఉందంటూ స్థానిక బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications