కేసీఆర్ సీఎంగా కొనసాగితే తెలంగాణ అధ్వాన్నమే: పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్ రెడ్డి అల్పహారం

హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యపేటకు చేరింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్ రెడ్డి అల్పహారం

పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్ రెడ్డి అల్పహారం

కాగా, సూర్యపేట చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలి అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అల్పాహారం చేశారు. జాతీయ అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మ ఇంట్లో ఆహారం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా విధులకు డుమ్మా కొట్టకుండా ఆమె విధులు నిర్వర్తించారు. కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలన్నారు కేంద్రమంత్రి. అనంతరం ఆమెను సన్మానించారు. కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.

ప్రధాని మోడీ ఆదేశాల మేరకే తన పర్యటన అంటూ కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ ఆదేశాల మేరకే తన పర్యటన అంటూ కిషన్ రెడ్డి

ఆ తర్వాత రెండో రోజు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేబినెట్ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ తనకు పదోన్నతి కల్పించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు. రైతులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కలవాలని ప్రధాని కోరినట్లు తెలిపారు.చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను ప్రధాని త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. దీపావళి వరకు ఇచ్చే ఉచితం బియ్యం అవసరమైతే మరికొన్ని నెలలు పెంచుతామన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు రూ. 5 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తోందన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి విద్యాభ్యాసం అందిస్తామన్నారు. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రిని 9సార్లు పరిశీలించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. వారియర్స్‌ను ప్రోత్సహించాలన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అధ్వాన్నస్థితిలోకే..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అధ్వాన్నస్థితిలోకే..

అంతకుముందు తొలి రోజు కోదాడలో నిర్వహించిన జన ఆశీర్వాద సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది టీఆర్ఎస్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మరికొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అధ్వాన్నంగా మారుతుందన్నారు. సీఎం కుర్చీ, కుటుంబం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. కేసీఆర్‌ను హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఒక వ్యక్తి కాదని, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తల ఉండ ఉందన్నారు. ప్రధాని మోడీకి కరోనా ఇబ్బందులున్నా.. అభివృద్ధిని కొనసాగిస్తున్నారని కొనసాగిస్తున్నారన్నారు.

బీజేపీకి భయపడే కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి బయటికొచ్చారు..

బీజేపీకి భయపడే కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి బయటికొచ్చారు..

ప్రధాని మోడీ పాకిస్థాన్ తోక కట్ చేశారని, ఇక ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించాలంటే ఆలోచించక తప్పదని అన్నారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి తన అభిమాన నేత అని అన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసేవారికి పదవులు వస్తాయనడానికి ఆయనే నిదర్శనమని అన్నారు. నరేంద్ర మోడీ నిర్ణయాల్లో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఏడేళ్లపాలనలో బీజేపీ సాహసేపోతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. సీఎం కేసీఆర్ ఏమీ చేయరని, బీజేపీ పోరటానికి భయపడే ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చారన్నారు. మంత్రివర్గంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. తెలంగాణ తల్లీ కేసీఆర్ గడీలో బందీ అయ్యిందని.. విముక్తి కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. లాఠీ దెబబ్లు, జైళ్లకు బీజేపీ భయపడదన్నారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేసేందుకు కష్టపడి పనిచేద్దామని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి అండగా ఉన్నారని.. ఏ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

వ్యక్తులు, కుటుంబాల పార్టీలను నమ్మొద్దంటూ కిషన్ రెడ్డి

వ్యక్తులు, కుటుంబాల పార్టీలను నమ్మొద్దంటూ కిషన్ రెడ్డి

ఇది ఇలావుండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం తలకు గాయమైంది. విజయవాడలో ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ రెడ్డి తలకు డోరు బలంగా తగిలింది. దీంతో తలకు గాయమైంది. విజయవాడలో ప్రజా అశీర్వాద సభ నిమిత్తం కిషన్ రెడ్డి అక్కడకు వెళ్లగా.. సభ ముగిశాక ఘటన జరిగింది. కారు డోరు కిషన్ రెడ్డి తలకు కాస్త బలంగా తగిలిందని, అయితే చిన్నపాటి గాయమే తగిలినట్లుగా అధికారులు చెప్పారు. నుదుటి దగ్గర చర్మం కొంతమేర కమిలిపోగా.. కాస్త రక్తం వచ్చింది. మంత్రి కిషన్ రెడ్డి ఈ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తన పర్యటనను కొనసాగించినట్లు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగానే కిషన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా ఏపీకి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చినట్లు తెలిపారు. అంతకుముందు తిరుపతి సభలో మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని, కేంద్రం తీసుకొచ్చిన పథకాలే అమలవుతున్నాయన్నారు. . జల వివాదాలను తెలుగు రాస్ట్రాలు పరిష్కరించుకోవాలన్నారు.

చర్చలతో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్ర భావన అని అన్నారు. కరోనావైరస్ సమయంలో ఏపీకి 4500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపిందని తెలిపారు. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసిందని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసిందని వివరించారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని వైసీపీ, టీడీపీలనుద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+