రేవంత్ రెడ్డి బైమిస్టేక్‌లో సీఎం అయ్యారు! ఇంత అహంకారమా?: కిషన్ రెడ్డి ఫైర్

ఎన్నికల్లో ఓటమి భయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‍​లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు పోటీపడుతున్నాయని దుయ్యబట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా, రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా.. ఆ రెండు పార్టీలు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం సీఎం రేవంత్​ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందన్నారు.

Union Minister Kishan Reddy Fires at CM Revanth reddy for his comments on journalists

తమ పార్టీపై ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు తమనే ఆదరిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ లబ్దిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

బైమిస్టేక్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు పెట్టదని.. కానీ, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టించారని చురకలంటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవబోతుందన్నారు కిషన్ రెడ్డి. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో అసహనం కనిపిస్తోందన్నారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను జైల్లో వేస్తే బుద్ది వస్తుందన్న రేవంత్ రెడ్డి.. ప్రకటనలు ఆయన అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+