వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్య శిఖరం కూలిపోయింది.!సినీ పరిశ్రమ ఒక గొప్ప కవిని కోల్పోయిందన్నకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు. సిరివెన్నెల అకాల మరణం పట్ల తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేసారు కిషన్ రెడ్డి. సిరివెన్నెల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ భగవంతుడు కుటుంభ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.

అంతే కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనకు ఎంతో ఆత్మీయులని, సిరివెన్నెల సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకున్నారని, అంత గొప్ప సాహిత్యాన్ని ఆ సినిమాకు అందించారని గుర్తు చేసారు. సిరివెన్నెల కలం నుండి వచ్చిన పాటలు తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతాయని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా ప్రతిబింబించి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని కొనియాడారు.

Union Minister Kishan Reddy says the film industry has lost a great poet!

1997లో బిజెపి జాతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారికి జాతీయస్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో యువ కళాకారుడిగా అవార్డును అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా అందించడం జరిగిందని, వారితో అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

భారతమాత మహా హారతి కార్యక్రమంలో వారు పాల్గొనడం దేశ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు వివరిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా విన్నారని, వారి పాటల ద్వారా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను వివరించడంతో పాటు దేశ భక్తిని, దైవ భక్తి ని, ప్రబోధించడం ద్వారా గొప్ప వ్యక్తులుగా ఎదగడమే కాకుండా యువత నడవడికను నిర్ధేశించే విధంగా తన రచనలు ఉండేవని అన్నారు. సినీరంగంలో అనేక నంది అవార్డులతో పాటు, పద్మశ్రీ బిరుదును పొందిన వ్యక్తి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అని కొనియాడారు.

English summary
Union Minister G. Kishan Reddy said that the death of famous writer Sirivennela Sitarama Shastri was a great loss to the world of Telugu literature. Kishan Reddy expressed deep sorrow over the untimely death of Sirivennela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X