Unstoppable with NBK:బాలయ్య మరో సెన్సేషన్ : ఈ సారి కేటీఆర్ - రాంచరణ్ కాంబో..!?
Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ లో మరో సంచలనం. ఇప్పటికే బాలయ్య - పవన్ కల్యాణ్ కాంబోతో సిద్దమవుతున్న ఎపిసోడ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా బాలయ్య షోకు పవన్ రాక పైన ఇద్దరి ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించింది. అదే విధంగా ఎపిసోడ్ షూటింగ్ సమయంలో బాలయ్య ప్రశ్నలు..పవన్ సమాధానాల పైన ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ షో ప్రసారం మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని కోసం నిరీక్షిస్తున్న సమయంలొనే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సారి పొలిటికల్ అండ్ మూవీ హారోల కాంబోతో కొత్త ఎపిసోడ్ కు ప్లాన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్.. హీరో రాంచరణ్ ఇద్దరితో కలిపి షో కు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య వరుస షో లతో అన్ స్టాపబుల్..
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ అంచనాలకు మించి సాగుతోంది. చంద్రబాబు - లోకేశ్ తో ప్రారంభించిన ఈ రెండో సీజన్ లో సంచనాలు నమోదు చేస్తున్నారు. వరుసగా హీరోయిన్స్.. బాహుబలితో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన బాలయ్య.. పవన్ కల్యాణ్ తో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ షో తో సెకండ్ సీజన్ పూర్తి చేసి కొంత గ్యాప్ ఇస్తారనే ప్రచారం సాగింది. బాహుబలి షో కు ఇప్పటికే అనూహ్య స్పందన కనిపిస్తోంది. బాహుబలి సెకండ్ ఎపిసోడ్ ఈ నెల 6న స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతికి బాలయ్య - పవన్ కల్యాణ్ షో వస్తుందని భావించినా, మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి ఎపిసోడ్ ప్రసారానికి నిర్ణయించారు. జనవరి 13న ఈ ఎపిసోడ్ కు ప్లాన్ చేసారు. ఆ తరువాతనే లక్షలాది మంది వెయిట్ చేస్తున్న బాలయ్య - పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

కేటీఆర్ - రాం చరణ్ దోస్తీ పై స్పెషల్
ఇప్పటి వరకు సినిమా - పొలిటికల్ సెలబ్రెటీలతో షో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ నిర్వాహకులు.. ఈ సారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు- హీరో రాం చరణ్ తో కలిపి పొత్త ఎపిసోడ్ కు ప్లాన్ చేసారు. సంక్రాంతి లోగానే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. మంత్రి కేటీఆర్ - మెగా ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఉంది. సినీ హీరోలు - మంత్రి కేటీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించి సినీ ఈవెంట్స్ కు కేటీఆర్ హాజరయ్యారు. అదే విధంగా మంత్రి కేటీఆర్.. హీరో రాంచరణ్ మధ్య ఉన్న దోస్తీని హైలైట్ చేస్తూ ఈ ఎపిసోడ్ ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాం చరణ్ తాజాగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో ఫోన్ ద్వారా సందడి చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రీల్ కమ్ రియల్ హీరో కాంబినేషన్ అందునా బాలయ్య హోస్టింగ్ తో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

బాలయ్య - మెగా హారోల ఇంట్రస్టింగ్ ఈక్వేషన్
బాలయ్య హోస్ట్ గా.. కొనసాగుతున్న అన్ స్టాపబుల్ కు ఊహించని స్పందన వస్తోంది. ప్రధానంగా రాజకీయంగా - సీనీ ఇండస్ట్రీకి సంబంధించి గెస్టుల ఎంపిక భిన్నంగా సాగుతోంది. బాలయ్య హోస్టుగా ఉండటంతో, గెస్టుల ఖరారు నుంచే ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబు తో బాలయ్య నిర్వహించిన షో లో రాజకీయంగా టీడీపీ అధినేత ఎంతో కాలంగా సాగుతున్న వివాదాలకు సమాధానాలు ఇస్తూ ముగింపు పలికే విధంగా షో కొనసాగింది. అదే విధంగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు జనసేనాని వ్యక్తిగత జీవితం పైన వస్తున్న ఆరోపణలకు పూర్తి స్థాయి సమాధానంతో ఇక ఎవరూ ఆ అంశాలు ఎత్తకుండా సమాధానం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు కేటీఆర్ - రాం చరణ్ కాంబోలో బాలయ్య నిర్వహించే షో గురించి సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications