HYD ప్రజలకు గుడ్ న్యూస్.. న్యూ లుక్ లోకి ఆ స్టేషన్.. త్వరలో అందుబాటులోకి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ది చేస్తోన్న సంగతి తెలిసిందే. చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లతో పాటుగా మరో ఆరు స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. వీటిల్లో ఉప్పుగూడ ఒకటి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 26.81 కోట్ల వ్యయంతో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్ నవీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వే వ్యవస్థ.. రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారాభివృద్ధి చేపడుతుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు, 2023, ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇటీవల, తెలంగాణలోని మూడు అమృత్ స్టేషన్లను (బేగంపేట, వరంగల్ & కరీంనగర్) ప్రధాని మోదీ ప్రారంభించారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్‌లోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ. 26.81 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఉప్పుగూడ స్టేషన్ హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో ఫలక్ నుమా - కాచిగూడ సెక్షన్ లో ఉన్న సబర్బన్ గ్రేడ్-3 స్టేషన్.. ఈ ప్రాంతంలోని, చుట్టుపక్కల ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. ఈ స్టేషన్‌లో రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. ప్రయాణికులు ప్రధానంగా ఇక్కడి నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సబర్బన్ రైళ్లలో, ముఖ్యంగా హైటెక్ సిటీ, లింగంపల్లి మొదలైన నగరంలోని పశ్చిమ భాగం వైపు ఉపాధి, వ్యాపారం కోసం ప్రయాణిస్తారు. సబర్బన్ రైళ్లతో సహా ఈ స్టేషన్‌లో రోజుకు దాదాపు 50 రైళ్లు ఆగుతాయి.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేసిన పనులు :
నూతన ముఖద్వారం ఏర్పాటు
రెండవ ప్రవేశ ద్వారం దగ్గర స్టేషన్ భవన అభివృద్ధి
స్టేషన్ ఆవరణ ప్రాంత అభివృద్ధి
12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
2 ప్యాసింజర్ లిఫ్ట్‌లు మరియు 2 ఎస్కలేటర్ల ఏర్పాటు
ప్లాట్‌ఫామ్ ఉపరితలాన్ని మెరుగుపరచడం
ప్లాట్‌ఫామ్ పై కప్పులు అదనంగా ఏర్పాటు
కాన్కోర్స్ & వెయిటింగ్ హాళ్ల లోపలి పునరుద్ధరణలు
దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్
నూతన సూచిక బోర్డులు మరియు నూతన ఫర్నిచర్ మొదలైనవి.
పనుల పురోగతి స్థితి
వెయిటింగ్ హాల్ మెరుగుదలలు, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిర్డర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి
పార్కింగ్ షెడ్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి కావస్తోంది.
లిఫ్ట్‌లు మరియు ఎస్కలేటర్‌ల షీటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.
అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి. డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications