సభాపర్వం.. యూరియా యాప్ పై తొలిరోజు తెలంగాణా శాసనసభ!

తెలంగాణా శాసన సభ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. అయితే తొలిరోజు శాసన సభా సమావేశాలలో సభాపర్వం సంతాపాలు, జీరో అవర్ తో వాయిదా పడింది.రాష్ట్ర శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర రెడ్డి, శాశనసభ మాజీ సభ్యులు కొండా లక్ష్మా రెడ్డి మరణం పట్ల శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

సభ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా
స్పీకరు గడ్డం ప్రసాద కుమార్ సంతాప తీర్మానాలను ప్రవేశపెడుతూ, దామోదర్ రెడ్డి మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చేవెళ్ళ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించిన లక్ష్మారెడ్డి 84ఏళ్ళ వయస్సులో ఇటీవల మరణించటం పట్ల స్పీకరు సంతాపం వ్యక్తం చేశారు. మాజీసభ్యుల మరణం పట్ల సభ రెండు నిముషాలు మౌనం పాటించి నివాళి అర్పించింది. జీరో అవర్ తర్వాత సభ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది.

Urea App Discussion Highlights First Day of Telangana Assembly

Take a Poll

శాసనసభలో యూరియా యాప్ పై స్పందించిన జూపల్లి కృష్ణారావు
ఈ రోజు శాసన సభలో యూరియా స‌ర‌ఫ‌రా, కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని, రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గినంత యూరియా స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డం వ‌ల్ల‌నే రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చెప్పారు. శాస‌న‌స‌భ‌లో ఒక స‌భ్యుడు లేవ‌నెత్తిన అంశంపై స్పందిస్తూ... రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులో వున్న యూరియాను స‌మంగా పంపిణీ చేసేందుకు మాత్ర‌మే యాప్ ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని వివ‌రించారు.

రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చ
అంత‌కుముందు దుబ్బాక స‌భ్యుడు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ, రైతులు యూరియా కొర‌త‌ను ఎదుర్కొంటున్నార‌న్నారు. యాప్ ద్వారా యూరియా ల‌భ్యం కావ‌డంపై రైతుల‌లో ఆందోళ‌న నెల‌కొంద‌ని పేర్కొన్నారు. కాగా, పంటల కొనుగోళ్లు కేంద్ర సంస్థ‌ల ద్వారా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మ‌రో స‌భ్యుడు లేవ‌నెత్తిన అంశాల‌కు స్పందిస్తూ చెప్పారు.

నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు
బిఆర్‌ఎస్ స‌భ్యులు ప‌ల్లా రాజేశ్వ‌ర‌రావు ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ రాష్ట్రంలో ప‌లుచోట్ల పంట‌ కొనుగోళ్ల విష‌యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. మార్కెట్ యార్డ్‌ల‌లో కొనుగోళ్ల‌ను స‌జావుగా, స‌కాలంలో జ‌రిగేలా చూడాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు. శాస‌న‌స‌భ జీరో అవ‌ర్ లో ప‌లువురు స‌భ్యులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ప‌రిగి ప్ర‌తినిధి టి.రామ్మోహ‌న్ రెడ్డి ఉద్యోగంలో వున్న ఉపాధ్యాయుల‌కు టెట్ మార్గ‌ద‌ర్శ‌కాల నుంచి మిన‌హాయింపు క‌ల్పించేలా కేంద్రప్ర‌భుత్వాన్ని ఒప్పించాల‌ని కోరారు.

తిరుమ‌ల‌, శ‌బ‌రిమ‌ల‌లో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌పై విజ్ఞప్తి
క‌రీంన‌గ‌ర్ స‌భ్యులు గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ... తిరుమ‌ల‌, శ‌బ‌రిమ‌ల‌లో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌ను చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బాల్కొండ స‌భ్యులు వేముల ప్ర‌శాంత రెడ్డి మాట్లాడుతూ... భీమ్‌గ‌ల్ లో వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణం ఇప్ప‌టికే 80 శాతం పూర్త‌యింద‌ని, మ‌రో ఐదు కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో దాన్ని పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఈ సమస్యల పరిష్కారం కావాలన్న శాసన సభ్యులు
ఇబ్ర‌హీంప‌ట్నం స‌భ్యులు మ‌ల్ రెడ్డి రంగారెడ్డి ప‌లు శివారు కాల‌నీలు వ‌ర్షాల వ‌ల్ల ముంపుకు గుర‌వుతున్నాయ‌ని, కాల‌నీవాసుల భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. కామారెడ్డి స‌భ్యులు వెంక‌ట ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ... ప్ర‌జా ప్ర‌తినిధులు మాట్లాడే స‌మ‌యంలో భాషా మ‌ర్యాద పాటించాల‌ని, హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌స్తావించారు. యాకూత్‌పురా స‌భ్యుడు జాఫ‌ర్ హుస్సేన్ మాట్లాడుతూ... ముఖ్యంగా పాత‌న‌గ‌రం వీధుల‌లో పారిశుద్ధ్యం స‌మ‌స్య తీవ్రంగా వుంద‌ని, ప‌రిష్క‌రించేందుకు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి
ఆలేరును రెవిన్యూ డివిజ‌న్ చేయాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గం స‌భ్యుడు బీర్ల ఐల‌య్య, సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కొత్త గూడెం స‌భ్యుడు కూనంనేని సాంబ‌శివ‌రావు, హైద‌రాబాద్ లోని మూసారాంబాగ్ వంతెన‌ను వేగంగా పూర్తి చేయాల‌ని అంబ‌ర్ పేట స‌భ్యుడు కాలేరు వెంక‌టేశం, మాజీ స‌ర్పంచ్ ల బిల్లుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని జ‌న‌గామ స‌భ్యుడు ప‌ల్లా రాజేశ్వ‌రరావు ప్ర‌స్తావించారు. కాగా, ఇటీవ‌ల ఎన్నికైన జూబ్లీహిల్స్ ప్ర‌తినిధి న‌వీన్ యాద‌వ్ స‌హా ప‌లువురు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+