అమెరికాలో తీవ్ర విషాదం: తెలంగాణాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి!
ఇటీవల కాలంలో అమెరికాలో స్థిరపడిన వారి హఠాన్మరణాలు ఆందోళనకరంగా మారాయి. అమెరికాకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, అమెరికాలో సెటిల్ అయిన తెలుగువారు, అమెరికాలో పిల్లలను చూడడానికి వెళ్లిన తల్లిదండ్రులు గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తున్నాయి.
గుండెపోటుతో యూఎస్ లో మరణించిన వరంగల్ వ్యక్తి
తాజాగా అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు యువ ఇంజినీర్ హఠాన్మరణం చెందడం కుటుంబసభ్యులు, స్నేహితులను విషాదంలో ముంచింది. వరంగల్‌కు చెందిన 40 సంవత్సరాల తాడిపత్రి రాకేశ్ వర్జీనియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు . తాజాగా అతను గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

కుటుంబంతో కలిసి జీవిస్తున్న రాకేష్
రాకేశ్ వరంగల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడు. ఉన్నత చదువులు పూర్తిచేసిన అనంతరం రాకేష్ గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వర్జీనియాలో నివసిస్తున్నారు.
వరంగల్ లో విషాదం
ఎంతో భవిష్యత్తు ఉన్న రాకేశ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం కుటుంబసభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాకేష్ మరణ వార్త తెలిసిన వెంటనే వరంగల్‌లోని బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
యూఎస్ లో మరణించిన వరంగల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయిని
ఇటీవల అమెరికాలో వరంగల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని కూడా గుండెపోటుతో మరణించారు. వరంగల్ పైడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న చిదురాల విజయ రాణి తన చిన్న కుమార్తె పూజకు కుమారుడు జన్మించడంతో వారిని చూసి రావడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. జరిగి మూడు రోజులైనా కాకముందే తాజాగా రాకేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మరణించారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications