కెటిఆర్‌తో యూఎస్ఐబిసి ప్రతినిధుల భేటీ(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె తారక రామారావు అన్నారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం విస్త్రృతమైన ప్రణాళికలు చేపడుతోందని, ఇందులో భాగంగా ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం రూపొందించినట్లు తెలిపారు. ఈ విధానంతోపాటు ప్రభుత్వ తోడ్పాటు అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు.

సోమవారం యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు తనతో భేటీ అయిన సందర్భంగా మంత్రి కెటిఆర్ ఈ మేరకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ముందు వరుసలో ఉందని తెలిపిన మంత్రి, ఆయా రంగాల తోపాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీ పెట్టుబడులకు హైదరాబాద్‌లో అవకాశాలున్నాయని వివరించారు.

కొత్త పారిశ్రామిక విధానం వల్ల పరిశ్రమలకు అనుమతులు కేవలం 15 రోజుల్లోనే పొందవచ్చని, పెట్టుబడిదారులకు దేశంలోనే మొదటిసారి రైట్ టూ సింగిల్ విండో క్లియరెన్స్‌ను కల్పించామని మంత్రి వివరించారు. తాను వచ్చే నెలలో అమెరికాలో పర్యటించి గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలను కలిసి ముఖాముఖి చర్చిస్తామని మంత్రి తెలిపారు.

యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డయాన్ ఫారెల్ నాయకత్వంలో వచ్చి బృందంలో హోస్పిరా కార్పొరేట్ ఎఫైర్స్ ఎండీ హిమాంశు ప్రియదర్శిని, ఎండీ శ్రీని శ్రీనివాసన్, మైలాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ ముకుందన్, జాన్సన్ ఆండ్ జాన్సన్ గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్ ఆండ్ ఇన్నోవేషన్స్ మాజీ డైరెక్టర్ అశోక్‌భట్టాచార్య, సీనియర్ డైరెక్టర్ రోహిత్ కుమార్, మెర్క్ సీనియర్ డైరెక్టర్ నీలిమా ద్వివేది, మిహిర్ షా, ఫైజర్ సీనియర్ డైరెక్టర్ క్లాడియా పుతిట్, శరత్ గోస్వామి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ డైరెక్టర్ నివేదిత మెహ్రా, ప్రతినిధులు అమీ హరియాని, మైఖెల్ గ్రీన్ తదితరులు మంత్రితో సమావేశమైన వారిలో ఉన్నారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె తారక రామారావు అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం విస్త్రృతమైన ప్రణాళికలు చేపడుతోందని, ఇందులో భాగంగా ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం రూపొందించినట్లు తెలిపారు. ఈ విధానంతోపాటు ప్రభుత్వ తోడ్పాటు అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

సోమవారం యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు తనతో భేటీ అయిన సందర్భంగా మంత్రి కెటిఆర్ ఈ మేరకు వివరించారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ముందు వరుసలో ఉందని తెలిపిన మంత్రి, ఆయా రంగాల తోపాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీ పెట్టుబడులకు హైదరాబాద్‌లో అవకాశాలున్నాయని వివరించారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తుందన్నారు. నగరంలోని మౌలిక వసతులు, సురక్షితమైన శాంతి భద్రతల వల్ల ఇప్పటికే పలు సర్వేల్లో నగరం ప్రథమ స్థానం దక్కించుకుందని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

ఇలాంటి కాస్మో పాలిటన్ నగరంలో పెట్టుబడులు పెడితే అభివృద్ధి, భవిష్యత్ బాగుంటుందని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు.

కెటిఆర్

కెటిఆర్

ఇప్పటికే మెడికల్ టూరిజంకు హైదరాబాద్ గమ్యంగా మారిందని, ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ చేపట్టిన టీ హబ్, టాస్క్ వంటి కార్యక్రమాల వివరాలను యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+