వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యామిలీ మినహా.. తెరాసలోని చాలామంది నేతలు కేసీఆర్‌కు షాకిస్తారా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెరాస ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన సోమవారం విలేకరుతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెరాస ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన సోమవారం విలేకరుతో మాట్లాడారు.

కేసీఆర్ దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప తెరాసలో చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎన్నికలకు ఏడాది ముందు వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వ్యాఖ్యానించారు.

తెరాస నుంచి ఊహించని స్థాయిలో వలసలు కాంగ్రెస్‌లోకి ఉంటాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని చెప్పారు. వరంగల్ సభలో కేసీఆర్ బీజేపీ గురించి మాట్లాడలేదని, దాంతోనే ఆ పార్టీ బలం ఏమిటో తేలిపోయిందన్నారు.

k chandrasekhar rao

తెరాసనే ఎన్నికల మూడ్ తెచ్చింది

బీజేపీకి ఉత్తరాదిలో కలిసి వచ్చిన ఫార్ములా ఇక్కడ పని చేయదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చిందని, తెరాసనే ఎన్నికల మూడ్ తెచ్చిందని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న వారు వచ్చే ఏడాది అమలు చేస్తామంటూ హామీలు ఇవ్వడం ఏమిటని ఎద్దేవా చేశారు.

ఉస్మానియా వర్సిటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మాట్లాడకపోవడం రాష్ట్రపతిని అవమానించడమే అన్నారు. ఖమ్మంలో రైతులు కడుపుమండి ఆందోళన చేస్తే రౌడీలు అని వ్యాఖ్యానించడం విడ్డూరం అన్నారు. రైతులకు అండగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఉండటం తెరాస జీర్ణించుకోలేకపోతోందని, భయపడుతోందన్నారు.

నా గెడ్డం హాట్‌గా మారింది

తెరాస నాయకులకు తన గడ్డం ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయిందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ అంతర్గత సమావేశాలు, బహిరంగ సభలు కూడా తన గడ్డం గురించి మాట్లాడకుండా పూర్తికావడం లేదని చ‌మ‌త్క‌రించారు.

English summary
TPCC chief Uttam Kumar Reddy on Monday said that many trs leaders will join Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X