ముగ్గురిని పెళ్ళి చేసుకొన్నావు, నీకేం తెలుసు: పవన్‌పై విహెచ్ సంచలనం
హైదరాబాద్:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మరోసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సంస్కృతి, సంప్రదాయాలను గురించి గొప్పగా చెబుతున్న పవన్ కళ్యాణ్ తాను మాత్రం ఆ సంస్కృతిని పాటించలేదని ఎద్దేవా చేశారు. మూడు వివాహలు ఎలా చేసుకొన్నాడని వి. హనుమంతరావు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
Recommended Video

తెలంగాణలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు పవన్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని పవన్ కు సూచిస్తున్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్‌పై ప్రశంసలు కురిపించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. బిజెపి నేతలు కూడ పవన్ కళ్యాణ్‌పై ఒంటి కాలిమీద విమర్శలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తమ విమర్శల దాడిని మరింత పెంచారు.

పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగిన విహెచ్
సంస్కృతి , సంప్రదాయాలంటూ అభిమానుల సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగిస్తున్నారని సంస్కృతి అంటే ఏమిటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. భారత దేశంలో స్త్రీని గౌరవిస్తామని ఆయన చెప్పారు అయితే హిందూ సంప్రదాయం ప్రకారంగానే భార్య చనిపోతే మరో భార్యను వివాహం చేసుకొంటారని చెప్పారు. కానీ, భార్యలకు విడాకులు ఇచ్చి వివాహలు చేసుకొన్న చరిత్ర పవన్ కళ్యాణ్‌దని వి.హనుమంతరావు మండిపడ్డారు. ముగ్గురిని వివాహం చేసుకొన్న పవన్ కళ్యాణ్ సంస్కృతి గురించి మాట్లాడడాన్ని విహెచ్ ఎద్దేవా చేశారు.

సంస్కృతి గురించి ఏం తెలుసు
కార్యకర్తల సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తున్నారని వి.హనుమంతరావు గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ మంచిగా రాసిస్తున్నారని కితాబిచ్చారు. కానీ, స్క్రిప్ట్ రాసిచ్చిన వ్యక్తి సంస్కృతి గురించి రాసిచ్చి పవన్ ను ఇరుకున పడేశాడని వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఇతరులను ఇరుకున పడేసే ఉద్దేశ్యంతో స్క్రిఫ్ట్ రైటర్ సంస్కృతి గురించి రాశాడని, కానీ అది పవన్‌కే చుట్టుకొందని విహెచ్ అన్నారు.

ఆరోపనలకు సమాధానాలివ్వు
పవన్ కళ్యాణ్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు.ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా దాటవేత వైఖరి సరైందికాదని వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.

పవన్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్
పవన్ కళ్యాణ్ తెలంగాణ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటనను నిలువరించే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగానే ఈ విమర్శలు చేస్తోందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications