కాకినాడలో కాంగ్రేస్ నేత వీహెచ్ ధర్నా , ! అణగారిన వర్గాలు ఏకం కావాలి

హైద్రబాద్ లో రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానలు ఆంధ్ర ప్రజల కూడ తెలియచేసేందుకు కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కాకినాడలో ధర్నా చేశారు. . హైద్రబాద్ , పంజాగుట్ట సర్కిల్ వద్ద స్థాపించాలనుకున్న అంబేద్కర్ విగ్రహం డంప్ యార్డ్ కు చేరిన విషయం తెలిసిందే,ఈ నేపథ్యంలోనే దీన్ని ఆంధ్ర ప్రజల్లోకి కూడ తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంలో ఆయన ధర్న చేపట్టారు.

హైద్రబాద్ పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహ ధ్వంసం నేపథ్యంలోనే దీంతో పలు దళిత సంఘాలు , రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టారు .కాగా ఇదే అంశంపై ఆందోళన చేస్తున్న పలు దళిత నేతలను సైతం తెలంగాణ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. దీంతో తెలంగాణలో బాద్యులను శిక్షించేందుకు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి పార్టీలు . ఈనేపథ్యంలోనే వి.హనుమంతరావు ఇదే విషయంపై ఆంధ్ర ప్రదేశ్ లో కూడ ఆందోళన కొనసాగించాలని భావించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబెద్కర్ విగ్రహం వద్ద ధర్నా కు బైఠాయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో దళితులు,బీసీ లను కలుపుకుని అందోళనను ఉదృతం చేస్తానని చెప్పారు.

 V hanumanta rao done Dharna at kakinada

కాగా వీహెచ్ ఇదే విషయంలో స్వంత పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అయినా, ఉత్తమ్ పట్టించుకోవడం లేదని ఆయన రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ ,బీసీ ఓట్లు కావాలి కాని వారి సమస్యలు పట్టవా అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు . దీంతో ఉత్తమ్ సైతం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+