కేసీఆర్, సోనియాలపై వంటేరు ఫైర్, జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీ జెండా మోశారా.. రేవంత్ నిలదీత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ రెండు పార్టీలలో చేరిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అటు సోనియా, ఇటు కేసీఆర్ టీడీపీని అంతం చేయాలని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

Vanteru Pratap reddy fires at KCR and Sonia Gandhi.

కాగా, అంతకుముందు రోజు బీజేపీపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని మురళీధర రావు పెద్ద మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు అంటే కేసీఆర్‌కు నష్టమని వారి ఉద్దేశమన్నారు. టీడీపీని చంపాలనుకున్న పార్టీ టీఆర్ఎస్‌ను రేవంత్ ఆక్షేపించారు.

అలాంటి పార్టీతో పని చేయాల్సిన అవసరం ఏముందన్నారు. టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డి ఏనాడైనా టీడీపీ జెండా మోశారా అని నిలదీశారు. ఆ రాష్ట్రానికి ప్రమాదం వచ్చినప్పుడు వారంతా ఒక్కటి కాలేదా అని నిలదీశారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vanteru Pratap reddy fires at KCR and Sonia Gandhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి