నా ప్రాణాలకు ముప్పుంది: టిడిపి నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ నుండి తనకు ప్రాణహని ఉందని టిడిపి నేత తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెయిల్‌పై సోమవారం సాయంత్రం విడుదలైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
టిడిపి నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్వగ్రామం దౌలాపూర్ కు చెందిన ఓయూ విద్యార్థి మురళి గత ఏడాది డిసెంబర్ 3న ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో ఓయూలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
ఆ సమయంలో చోటు చేసుకొన్న అల్లర్లలో ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో ఆయన అరెస్టై విడుదలయ్యారు. అయితే మరో 3 కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో ప్రతాప్ రెడ్డి డిసెంబరు 12న అజ్ఞాతంలోకి వెళ్ళారు.

అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు ఈ ఏడాది జనవరి 9వ, తేదిన అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు నుండి బెయిల్‌పై ఒంటేరు ప్రతాప్ రెడ్డి జనవరి 29వ, తేది సాయంత్రం విడుదలయ్యారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ రావణ కాష్టంగా మారుస్తున్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తన ప్రాణాలకు హని జరిగితే ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యత వహించాల్సి వస్తోందని ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.
2019లో గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ తనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తానన్నారు. ఇక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నట్లు తెలిపారు












Click it and Unblock the Notifications