హైదరాబాద్‌లో భారీ వర్షం: సిటీ జనులకు జీహెచ్ఎంసీ వార్నింగ్, ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేటి సాయంత్రం నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాయంత్రంపూట బయటకు వచ్చిన ప్రజలు, విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్, యూసుఫ్‌గూడ,పంజాగుట్ట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బోయిన్ పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్ చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భా వర్షం కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది.

మరో రెండు గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ దగ్గర నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
#WATCH | Telangana: Rain lashes several parts of Hyderabad. pic.twitter.com/MzgNoxsejc
— ANI (@ANI) August 15, 2024
ఏదైనా అనుకోని విపత్తు ఏర్పడితే వెంటనే 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. గుమ్మడిదలలో 9.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications