సీపీఐ సీనియర్ నేత బర్దన్‌కు అస్వస్థత: ఆరోగ్యం నిలకడగా ఉందన్న చాడ
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఖండించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని సోమవారం ఉదయం ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
92 ఏళ్ల ఏబీ బర్దన్ గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. బర్దన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని సీపీఐ నేత ఒకరు తెలిపారు. కాగా, బర్దన్ భార్య నాగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.
ఆమె 1986లో స్వర్గస్తులయ్యారు. బర్దన్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఎనిమిది నెలల గర్భిణి మృతి చెందింది. దీంతో మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలు జడ్చర్లకు చెందిన కృష్ణవేణి(20).
దీంతో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూతో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని వైద్యులు వెల్లడించారు.
బాత్‌రూమ్ పైకప్పు కూలి వ్యక్తి మృతి
మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, గ్రామ పంచాయతీ ఉద్యోగి సాయిలు(50) జెడ్పీ హైస్కూల్లోని మరుగుదొడ్డిని శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలి అతని మీద పడింది. దీంతో సాయిలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications