అమెరికాలో తెలుగు టెక్కీ హత్య: 'కేంద్రం స్పందన ఏది'

అమెరికాలో ఏర్పడ్డ పరిస్థితులపై కేంద్రం చౌరవ చూపి అక్కడి అధికారులతో చర్చించడానికి భారత ప్రతినిధి బృందాన్ని పంపాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వీ హనుమంత రావు డిమాండ్‌ చేశారు.

సిద్దిపేట: అమెరికాలో ఏర్పడ్డ పరిస్థితులపై కేంద్రం చౌరవ చూపి అక్కడి అధికారులతో చర్చించడానికి భారత ప్రతినిధి బృందాన్ని పంపాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వీ హనుమంత రావు డిమాండ్‌ చేశారు.

ఆదివారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ మాటలతో అక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఈ విషయాన్ని కేంద్రం ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

అక్కడ నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం చొరవ చూపాలన్నారు.

VH appeals Modi government to respond on Kansas firing

కేంద్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితులపై ఇతర దేశాలతో కలిసి మ్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమెరికా వెళ్లడానికి వీసా, ఇమ్మిగ్రేషన్‌ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంపై చొరవ చూపాలని కోరారు.

ప్రధాని కేవలం నోట్ల రద్దు గురించే మ్లాడుతున్నారని ఇక దానిని విడిచిపెట్టి అమెరికాలో భారత పౌరుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి పెచ్చు మీరుతుండటంతో ఇద్దరు తెలుగువారు తమ భాషలో మ్లాడుకోవడానికే జంకే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

అవసరమైతే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలను అక్కడికి పంపాలన్నారు. కొందరు తెరాస నేతలు కాంగ్రెస్‌ పార్టీని త్టి సిఎం కేసీఆర్ సమ్మతి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెరాస నేతలు తాము వాడే భాషను మార్చుకోవాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు కోదండరాం వంటి వారు స్పందిస్తే ీఆర్‌ఎస్‌ నేతులు నోరు పారేసుకోవడం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను మార్చడానికి ప్రయత్నిస్తే ఉద్యమిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+