KTR: ప్లేట్ ఫిరాయించిన విజయ్ మద్దూరి.. ఇప్పుడు ఫోన్ స్విచ్చాఫ్..!
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే కేసు విచారణలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలి పెట్టారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి విచారించి విడిచిపెట్టారు. ఆ తర్వాత అతను ప్లేట్ ఫిరాయించాడు. తనకు ఏం తెలియదని.. పోలీసులు తనను ఇరికించాలని సూచుస్తున్నారని ఆరోపించారు.
నిన్నటి వరకు పరారీలో ఉన్న రాజ్ పాకాల హై కోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు. విచారణకు హాజరు కావడానికి రాజ్ పాకాలకు రెండు రోజుల సమయం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక మరోసారి విజయ్ మద్దూరుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. కానీ అతను అప్పటికే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ప్రస్తుతం అతను అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో సోదాల సందర్భంగా విజయ్ మద్దూరి తన ఫోన్ కు బదులుగా ఓ మహిళ ఫోన్ ఇచ్చాడు. దీంతో సందరు మహిళ తన ఫోన్ ఇవ్వాలని పోలీసుల వద్దకు వచ్చింది.

పోలీసులు ఇంత అమాయకంగా ఎలా వ్యవహారించారని విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు పార్టీ చేసుకుంటే తప్పా అని ప్రశ్నిస్తుంది. దీపావళి పార్టీ చేసుకున్నారని చెబుతోంది. బీఆర్ఎస్ నేతల మాటలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. దీపావళి అంటే పవిత్రమైన పండుగ.. ఈ పండుగకు మద్యం తాగుతారా.. పైగా తెలంగాణ వారు అంటే మద్యం తాగే వారని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
డ్రగ్స్ పార్టీ చేసుకోవడం తెలంగాణ సంస్కృతా అని నిలదీస్తున్నారు. కాగా ఈ విషయంపై పది రోజులు హడావిడి చేసి తర్వాత ఏం లేదని చెబుతారని సామాన్య ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏదీ ఏమైనా.. రాజ్ పాకాల వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేటీఆర్ కు పెద్ద డ్యామేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ బాధ్యతలను హరీశ్ రావు అప్పగించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications