పాపం విజయా రెడ్డి.!మీడియా ముందుకు వచ్చే ఉద్దేశం లేకుండే.!అడ్డంగా బుక్ చేసిన రేవంత్.!
హైదరాబాద్: ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కొనసాగుతున్న అధికార పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుకోసం ముందస్తు మాటగా పార్టీ పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డిని తన నివాసంలో సంప్రదించేందుకు విజయా రెడ్డి ఆయన నివాసనికి శనివారం ఉదయం చేరుకున్నారు. ఇంతవరకూ కథ బాగానే ఉంది కానీ రేవంత్ ఇంటి దగ్గర మొహరించిన మీడియాను చూసి విజయా రెడ్డి ఖంగారుపడ్డట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం 10గంటలకు రేవంత్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం గురించి తెలియని విజయారెడ్డి రేవంత్ నివాసంలో మీడియాకు అడ్డంగా బుక్కయ్యింది.

రేవంత్ ను మర్యాద పూర్వకంగా కలిసేందకు వచ్చిన విజయా రెడ్డి.. మనసు చంపుకుని మీడియా అడ్రెస్
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశాన్ని రేవంత్ రెడ్డితో తప్ప ఎవరికీ తెలియకుండా ఉండాలన్నది విజయారెడ్డి ఉద్దేశం. ముందస్తుగా పార్టీ మార్పు గురించి మాట్లాడి ఇతరత్రా రాజకీయ హామీల పట్ల స్పష్టత వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో అన్ని విషయాలు పంచుకుందామనుకున్న విజయారెడ్డి వ్యూహం దారుణంగా బెడిసికొట్టినట్టైంది. రేవంత్ ను కలిసిన విజయారెడ్డిని నేరుగా మీడియా సమావేశంలో తన పక్కన కూర్చోబెట్టుకోవడమే కాకుండా రేవంత్ మాట్లాడిన తర్వాత మైకును విజయారెడ్డికి ఇచ్చి ఇప్పుడు విజయారెడ్డి మాట్లాడతారని చెప్పడంతో ఆమె మరింత ఖంగారుపడినట్టు తెలుస్తోంది.

పార్టీ మారిన తర్వాత విలేఖరుల సమావేశం.. కానీ పార్టీ మారకుండానే మీడియాతో మాట్లాడిన పీజేఆర్ కూతురు
మర్యాద పూర్వకంగా పీసిసి అద్యక్షుడిని సంప్రదించి భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించి మూడో కంటికి కనపడకుండా వెళ్లిపోదామనుకున్న విజయారెడ్డి కి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. సమయం, సందర్బం, తిధి, నక్షత్రం, ముహూర్తం లేకుండానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు చాలా సింపుల్ గా ప్రకటించారు. ఎప్పుడు, ఎక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే అంశం మాత్రం తర్వాత వెళ్లడిస్తానని విజయారెడ్డి స్పష్టం చేసారు. అంటే పార్టీ మారకుండానే ప్రతిపక్షపార్టీ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొని అందరిని ఆశ్యర్యానికి గురిచేసారు విజయారెడ్డి.

అధికార టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తి.. పార్టీ మారాలనుకున్న విజయారెడ్డి
రాజకీయ నేతలు పార్టీ మారిన తర్వాత విలేకరులతో మాట్లాడుతారు కానీ విజయా రెడ్డి మాత్రం విలేఖరులతో మాట్లాడిన తర్వాత పార్టీ మారబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా తన ప్రమేయం లేకుండా జరిగిపోయినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నివాసంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా, ఎవరెవరు ఉన్నారో తెలుసుకోకుండా, శనివారం రోజు పీసిసి అద్యక్షుడి కార్యక్రమాలు ఏంటో తెలుసుకోకుండా అకస్మాత్తుగా వచ్చి ఇరకాటంలో పడ్డట్టు అయిపోయింది విజయారెడ్డి పరిస్ధితి. అధికార టీఆర్ఎస్ పార్టీలో కార్పోరేటర్ గా గెలిచిన తర్వాత మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ విజయారెడ్డి కొంత కాలం నుండి టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

కాస్త రహస్యంగా ఉండాలనుకున్న విజయారెడ్డి.. మీడియాతో తప్పక మాట్లాడని పరిస్థితి..
రేవంత్ రెడ్డి సారధ్యంలో పార్టీలో నూతన ఉత్సాహం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు విజయారెడ్డి. కానీ తన రాజకీయ ప్రస్ధానం గురించి ఎంత రహస్యంగా అడుగులు వేయాలనుకున్నారో అంతే వేగంగా తన కార్యాచరణ బహిర్గతం కావడంతో విజయారెడ్డి షాక్ కు గురైనట్టు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కండీషన్లు మాట్లాడుకోలేదు.. కానీ విజయారెడ్డి పార్టీ మారినట్టు అధికార టీఆర్ఎస్ పార్టీకి సంకేతాలందాయి. ఇప్పుడేంటి కర్తవ్యం అనే అంశంపై విజయారెడ్డి సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications