అల్లకల్లోలం: పన్నీరుపై విజయశాంతి సంచలనం, శశికళకు మద్దతు

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన రాములమ్మ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పన్నీరు పైన సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంటే.. విజయశాంతి మాత్రం మరోరకంగా స్పందించారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన రాములమ్మ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పన్నీరు పైన సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంటే.. విజయశాంతి మాత్రం మరోరకంగా స్పందించారు.

ఎవరికీ హానీ జరగకుండానే చిన్నమ్మ శశికళ పార్టీని కాపాడేందుకు కృషి చేస్తుంటే పన్నీరు సెల్వం దుష్టశక్తులతో కలిసి అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అదే సమయంలో అసెంబ్లీలో బలనిరూపణలో నెగ్గిన పళనిస్వామికి శుభాకాంక్షలు తెలిపారు.

vijayasanthi

కాగా, శశికళ సీఎం కావాలని గతంలో విజయశాంతి ఆకాంక్షించారు. జయలలిత మృతి అనంతరం పోయెస్ గార్డెన్‌లో శశికళను కలిశారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళే తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు విజయశాంతి వారం రోజుల క్రితం చెప్పారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు తనను బాధిస్తున్నాయన్నారు.

అన్నాడీఎంకే పార్టీని ఐక్యంగా ఉంచేందుకు జయలలిత ఎంతో కృషి చేశారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను భర్తీ చేసేందుకు శశికళే సరైన నాయకురాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తాను శశికళకే మద్దతిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+