కేసీఆర్‌తో ఢీ: రాములమ్మకు కీలకపదవి, రాహుల్ గాంధీ టీంలో చోటు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ చాలా రోజులుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదు విజయశాంతి. 2019 ఎన్నికల నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక పదవి ఇచ్చే అవకాశముందా?

అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. విజయశాంతికి జాతీయస్థాయి పదవి లభించబోతుందని, ఆమెకు తెలగంాణలో ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతోంది.

గ్లామర్ లోటు పూడ్చనున్న విజయశాంతి

గ్లామర్ లోటు పూడ్చనున్న విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్లామర్ కరువైందని, విజయశాంతికి పదవి ఇచ్చి, ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ఆ లోటును కొంచెం పూడుస్తారని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత అంతగా కనిపించలేదు

ఆ తర్వాత అంతగా కనిపించలేదు

2009లో విజయశాంతి మెదక్ లోకసభ సభ్యురాలిగా గెలిచారు. కానీ నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు అంతగా ఏర్పర్చుకోలేకపోయారు. అనంతరం తెరాస నుంచి బహిష్కరణకు గురయ్యాక ఆమె రాజకీయాలలో అంతగా నిలదొక్కుకోలేకపోయారు.

ఇది క్లియర్.. తెలంగాణలోనే విజయశాంతి

ఇది క్లియర్.. తెలంగాణలోనే విజయశాంతి

కొన్నాళ్లుగా ఆమె రాజకీయాల్లో క్రియీశీలకంగా కనిపించలేదు. దీంతో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెబుతారా? లేక తమిళనాడులో ఓ పార్టీలో చేరి అక్కడ క్రియాశీలకంగా మారుతారా? అనే చర్చలు కూడా సాగాయి. కానీ విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటారని తెలుస్తోంది.

విజయశాంతికి కీలక బాధ్యతలు

విజయశాంతికి కీలక బాధ్యతలు

విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం తనవంతు పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో క్రియాశీలకంగా మారనున్నారని అంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని హామీలను, మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు. దీనికి తోడు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

కేసీఆర్, తెరాసలకు ధీటుగా

కేసీఆర్, తెరాసలకు ధీటుగా

కేసీఆర్‌కు, తెరాసకు ధీటుగా పని చేస్తారన్న విశ్వాసంతో విజయశాంతికి కాంగ్రెస్‌ ప్రాముఖ్యతను ఇస్తోందని అంటున్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ టీమ్‌లో ఆమెకు చోటు దక్కవచ్చునని చెబుతున్నారు.

నాడు టీఆర్ఎస్ ధాటికి నిలువలేకపోయారు

నాడు టీఆర్ఎస్ ధాటికి నిలువలేకపోయారు

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయశాంతి టిఆర్ఎస్ ధాటికి నిలువలేక ఓడిపోయారు. ఇప్పుడు ప్రచార బాధ్యతలు చేపడితే, ఆమె మళ్లీ పోటీ చేస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. అయితే ఆమె మాత్రం రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కీలక పాత్ర పోషించనున్నారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress and former MP Vijayasanthi will play key role in Telangana Congress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి