Vijayashanti: వివేక్ వెంకటస్వామికి మద్దతుగా విజయశాంతి, షర్మిల..
కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ, ఈడీ సోదాలను ఆ పార్టీ నేత విజయశాంతి ఖండించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని తాను చెప్పిన విషయం నిజమవుతున్నదన్నారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయగానే ఐటీ, ఈడీలను బీజేపీ పంపిస్తున్నదని విమర్శించారు. ఇన్ని రోజులు బీజేపీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామిపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదన్నారు. బాల్క సుమన్ ఫిర్యాదు చేయగానే దాడులు జరిగాయన్నారు. బీజేపీ నుంచి బయటకు రాగానే ఐటీ, ఈడీ దాడులు దేనికి సంకేతమన్నారు.
ఎవరేం చేసినా భయపడేది లేదని, వివేక్ వెంకటస్వామి అయినా, తానైనా ఎవరం భయపడబోమని విజయశాంతి స్పష్టం చేశారు. మిగతా ఉద్యమకారులూ భయపడరని, ఎంతవరకైనా కొట్లాడదామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఇష్యూపై ఆమె ఎక్స్ లో స్పందించారు. గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు ప్రధాని మోడీ సహాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్ని డ్రామాలాడినా బీఆర్ ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలన్న సంగతి ప్రజలందరికీ తెలుసని గుర్తుంచుకోవాలని అన్నారు. గల్లీలో కుస్తీ పడుతూ, ఢిల్లీలో తెరచాటు రాజకీయాలు నడిపే వారికీ ఈ ఎన్నికలే గుణ పాఠం అవుతాయన్నారు. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులను ఇబ్బందుల పాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ ఎస్ లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం, లిక్కర్ స్కాంల పై ఎలాంటి చర్యలు లేవని, బీఆర్ఎస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు జరగడం లేదన్నారు.
ఓటమి భయంతోనే తన ఇంటిపై ఐటీ దాడులు చేయించారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కు, చెన్నూర్‌లో బాల్క సుమన్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా తన ఇళ్లు, సంస్థలపై ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయిస్తున్నారని చెప్పారు. 12 గంటల పాటు సోదాలు చేసిన ఆఫీసర్లు.. చివరకు ఖాళీ చేతులతో వెళ్లిపోయారని వివేక్ తెలిపారు.
ఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని వివేక్ సతీమణి సరోజ అన్నారు. అందుకే కావాలనే ఐటీ రెయిడ్స్ చేయిస్తున్నారని చెప్పారు. తమ ఇళ్లు, సంస్థలపై కేసీఆర్, బాల్క సుమన్ ఐటీ,ఈడీ రైడ్స్ చేయించారని ఆరోపించారు. సోదాల్లో రెండే చిప్పలు దొరికాయని వాటిలో ఒకటి కేసీఆర్, మరొకటి బాల్క సుమన్ తీసుకోవాలని సరోజ ఎద్దేవా చేశారు. బుధవారం వివేక్ తరఫున సరోజా వివేక్.. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి మందమర్రిలోని రాజీవ్ నగర్ , శాంతి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications