విజయశాంతికి కీలక పదవులు: రేవంత్‌కు ప్రాధాన్యతపై సీనియర్ల అసంతృప్తి, ‘సురేష్ రెడ్డి పేరు’
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేతలకు కొత్త పదవులను కట్టబెట్టింది. పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలు నియమించింది. అయితే, ఈ కమిటీపై కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు సీనియర్ నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు.

విజయశాంతికి కీలక పదవులు
కాగా, దాదాపు సీనియర్లందరికీ కీలక బాధ్యతలు అప్పజెప్పిన రాహుల్ గాంధీ.. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కూడా కమిటీలో తగిన ప్రాధాన్యతనిచ్చారు. స్టార్ క్యాంపెయినర్, తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు వంటి కీలక పదవులను విజయశాంతికి అప్పగించారు.
Recommended Video


టీఆర్ఎస్‌లో చేరిన సురేష్ రెడ్డికి పదవి..
ఈ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా కో- చైర్‌పర్సన్‌గా సౌదాగర్ గంగారాం, సభ్యులుగా దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలం గౌడ్‌లను నియమించినట్లుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా పార్టీ వీడిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరును తొలగించి రివైజ్డ్ కో- ఆర్డినేషన్ కమిటీని కూడా ప్రకటించింది.

రేవంత్‌కు కీలక పదవిపై డీకే సహా సీనియర్ల అసంతృప్తి
కాగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించారు రాహుల్ గాంధీ. అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంపై సీనియర్ నేతలు వి. హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెడతారా? అని ప్రశ్నించిన పొంగులేటి.. దీనిపై రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ కూడా పార్టీ పదవుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. పార్టీ ఎక్కడికి పిలిచినా ప్రచారం చేస్తానని అన్నారు.

వివిధ కమిటీలు ఇలా..
కోర్ కమిటీ..
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్‌తో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్, జి. చిన్నారెడ్డి, ఎ. సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలు కోర్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
కో- ఆర్డినేషన్ కమిటీ
53 మందితో ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనుండగా... మిగతా అన్ని కమిటీల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ప్రచార కమిటీ
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క నియమితులు కాగా.. కో- చైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్ వ్యవహరించనున్నారు. వీరితో పాటుగా మరో 14 మంది సభ్యులు ఉంటారు.
ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ
ఈ కమిటీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. ఇందులో 41 మంది సభ్యులు, మరో 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.
మేనిఫెస్టో కమిటీ
కమిటీ చైర్మన్ : మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
కో- చైర్‌పర్సన్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కన్వీనర్ : బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
వీరితో పాటుగా మరో 32 మంది సభ్యులు కూడా ఉంటారు.
స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ
కమిటీ చైర్మన్ : వి. హనుమంతరావు,
కో- చైర్‌పర్సన్లు : సర్వే సత్యనారాయణ, మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు,
కన్వీనర్ : పొంగులేటి సుధాకర్ రెడ్డి
మరో 15 మంది కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ
చైర్మన్ : మర్రి శశిధర్ రెడ్డి
కో- చైర్‌పర్సన్ : కమలాకర్ రావు
కన్వీనర్ : జి. నిరంజన్
వీరితో పాటుగా మరో ఆరుగురు సభ్యులు
డిసిప్లినరీ యాక్షన్ కమిటీ
చైర్మన్ : ఎం. కోదండరెడ్డి
కో- చైర్‌పర్సన్ : ఎ. శ్యాంమోహన్
కన్వీనర్లు : బి. కమలాకర్ రావు, నంది ఎల్లయ్య, సంభాని చంద్రశేఖర్, పి. బలరాం నాయక్, సీజే శ్రీనివాసరావు
ఎల్డీఎంఆర్సీ కమిటీ
చైర్మన్ : ఆరెపల్లి మోహన్
కో- చైర్‌పర్సన్ : డి. రవీందర్ నాయక్
కన్వీనర్ : హెచ్. వేణుగోపాల్ రావు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications