ఇంజెక్షన్‌తో అమ్మానాన్న హత్య.. కన్నవారినే కడతేర్చిన కూతురు!
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను ఓ కూతురు అతి కిరాతకంగా చంపేసింది. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను అనంతలోకాలకు పంపింది. తన ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అనస్ఠీషియా ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు తీసింది.
అసలేం జరిగిందంటే?
యాచారం గ్రామానికి చెందిన బాలరాజు, లక్ష్మమ్మ దంపతులకు సురేఖ అనే కూతురు ఉంది. ఆమె సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సురేఖ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ ప్రేమ విషయాన్ని సురేఖ తన తల్లిదండ్రులకు తెలపగా.. వారు ససేమిరా అన్నారు. వేరే సంబంధం చూసి సురేఖకు వివాహం చేయాలని నిశ్చయించారు.

హత్యకు పక్కా ప్లాన్..
జనవరి 28, 2026 బుధవారం తెల్లవారితే సురేఖకు పెళ్లిచూపులు జరగాల్సి ఉంది. తన ప్రేమకు తల్లిదండ్రులు శాశ్వతంగా అడ్డు తొలుగుతారని భావించిన సురేఖ.. ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి తీసుకువచ్చిన అనస్ఠీషియా ఇంజెక్షన్లను తల్లిదండ్రులకు ఇచ్చింది. "మీకు ఆరోగ్యం బాగోలేదు కదా.. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది" అని వారిని నమ్మించింది. అనస్థీషియా ఇంజెక్షన్లు ఓవర్ డోస్ ఇవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. కన్నకూతురు కదా అని నమ్మిన ఆ తల్లిదండ్రులు నిద్రలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. సురేఖ ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రిలో వైద్యులకు తెలియకుండా దొంగతనం చేసినట్లు తెలిసింది. అనంతరం సిరంజీలను బయట కొనుగోలు చేసింది.
పోలీసుల ఎంట్రీ.. గుట్టు రట్టు!
మరుసటి రోజు ఉదయం బాలరాజు, లక్ష్మమ్మలు ఎంతకూ నిద్రలేవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించగా.. ఇంజెక్షన్ గుర్తులు కనిపించాయి. సురేఖ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటపడింది. నిందితురాలు సురేఖను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కన్నవారిని కడతేర్చిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications