బీజేపీలో చేరిన వికాస్ రావు దంపతులు: వేములవాడ టికెట్ ఖాయమేనా?
హైదరాబాద్: గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే.. సీఎం కేసీఆర్ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. రోజువారీ ఖర్చుల కోసం రాష్ట్రంలోని భూములు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. బీరు, బ్రాందీ అమ్మితే గానీ.. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు, ఆయన భార్య దీపా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలన్నారు. ఆ మార్పు కోసమే వికాస్ లాంటి వారు పార్టీలో చేరుతున్నారన్నారు. ఇంకా అనేక మంది బీజేపీలో చేరాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గింపుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు లేదన్నారు. తెలంగాణలోనే పెట్రోల్ ధర అధికంగా ఉందని.. చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు, భూముల రిజిస్ట్రేషన్, హౌస్ టాక్సులు పెంచి ప్రజలపై భారం మోపారనడి మండిపడ్డారు.
డాక్టర్ వికాస్ రావు పార్టీలో చేరడం సంతోషకరమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించారన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేశారంటూ కొనియాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. వికాస్ రావు బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. టికెట్ వస్తుందని.. గెలుస్తారని అన్నారు.
Welcomed Shri Chennamaneni Dr.Vikas Garu, son of former Union Minister & Ex-Governor of Maharashtra, Shri Chennamaneni Vidyasagar Rao Garu, and his wife Smt. Deepa Garu to the @BJP4India today in Hyderabad.
— G Kishan Reddy (@kishanreddybjp) August 30, 2023
Their contribution to society as doctors and social workers will be… pic.twitter.com/XcZrjgp96P
ఈ సందర్భంగా బీజేపీ నేత, విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. బీజేపీలో చేరడం భావోద్వేగమైన సంఘటన అన్నారు. కాగా, వికాస్ రావు వేములవాడ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికాస్ రావుకే బీజేపీ నుంచి వేములవాడ టికెట్ వస్తుందని తెలుస్తోంది. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications