హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాపై కాల్పులు జరిపారు, కఠినంగా శిక్షించాలి: పోలీసులకు విక్రమ్ వాంగ్మూలం ఇదే

తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్పారు.

నా భర్త అన్ని చెప్పారు, తప్పుడు ప్రచారం ఆపండి: విక్రమ్ భార్య ఆవేదననా భర్త అన్ని చెప్పారు, తప్పుడు ప్రచారం ఆపండి: విక్రమ్ భార్య ఆవేదన

దుండగులు కాల్పులు జరపగానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరినట్లు చెప్పారు. తన అరుపులు విన్న భార్య షిపాలి కిందకు వచ్చిందని, వెంటనే 108కు ఫోన్ చేయాలని ఆమెకు సూచించినట్లు తెలిపాడు.

vikram goud statement on shooting
అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో కారులోనే ఆస్పత్రికి తన భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్, వాచ్‌మన్ సహకరించారని తెలిపారు.

నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే తాను శుక్రవారం మాట్లాడలేకపోయానని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ తెలిపారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు విక్రమ్.

పోలీసులు ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నప్పటికీ విక్రమ్ గౌడ్ తన వాంగ్మూలంలో ఇలా చెప్పడంతో పోలీసులు మరో కోణంలో విచారించాల్సిన అవసరం ఏర్పడింది.

English summary
Former minister Mukesh Goud Son Vikram Goud given his statement on shooting to Police on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X