Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తండ్రిని అలా బెదిరించి: పక్కా ప్లాన్‌తో ఆలస్యంగా నోరు విప్పిన విక్రమ్

తనపై కాల్పులు జరిగిన తర్వాత, దానిని హత్యాయత్నంగా చూపించాలని విక్రమ్ గౌడ్ ముందే ప్లాన్ చేసుకున్నారు.ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: తనపై కాల్పులు జరిగితే, దానిని హత్యాయత్నంగా చూపించి, తాను తీర్చాల్సిన అప్పులకు సంబంధించిన డబ్బును తన తండ్రి ముఖేష్ నుంచి తీసుకోవచ్చన్న ఆలోచనతో విక్రమ్ స్వయంగా కాల్పుల డ్రామాకు తెరలేపాడని పోలీసులు తేల్చారు.

పక్కా ప్లాన్‌తో విక్రమ్ గౌడ్

పక్కా ప్లాన్‌తో విక్రమ్ గౌడ్

కేసు విచారణ దాదాపు ముగిసిందని, తండ్రిని బెదిరించాలన్నదే విక్రమ్ అసలు ఆలోచనని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తొలుత బహిరంగ ప్రదేశంలో ఈ ప్లాన్ అమలు చేయాలని విక్రమ్ భావించాడని పోలీసులు గుర్తించారు.

Recommended Video

    Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
    అలా చేస్తే దొరికిపోతానని

    అలా చేస్తే దొరికిపోతానని

    అలా చేస్తే దొరికిపోయే ప్రమాదం ఉందని ఆలోచించి, ఇంట్లోనే నాటకానికి తెర లేపాడని పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను విచారణ చేయగా, మొత్తం వ్యవహారం ఆయన నోటి నుంచే బయటకు వచ్చిందంటున్నారు.

    నాలాలో తుపాకీ పారేశాడు

    నాలాలో తుపాకీ పారేశాడు

    తనంటే ఎంతో ప్రేమ చూపించే తండ్రి నుంచి బకాయిలు తీర్చేందుకు అవసరమైన డబ్బును తీసుకోవాలన్న ఆలోచనతో ఇదంతా చేసినట్టు విక్రమ్ వెల్లడించాడని పోలీసులు గుర్తించారు. తద్వారా ఫైనాన్షియర్ల తలనొప్పులు ఉండవని భావించాడు. కాల్చుకున్న అనంతరం తుపాకీని నాలాలో పడేశాడు.

    ఒప్పందం చేసుకున్న వారు రాష్ట్రం దాటిన తర్వాతే

    ఒప్పందం చేసుకున్న వారు రాష్ట్రం దాటిన తర్వాతే

    మొత్తానికి తుపాకీతో కాల్చుకొని బెదిరించడం ద్వారా తండ్రి నుంచి డబ్బులు తీసుకోవాలని విక్రమ్ డ్రామా ఆడినట్లుగా గుర్తించారు. విక్రమ్‌కు పబ్బుల్లో పార్ట్‌నర్ షిప్ ఉంది. వ్యాపార, రాజకీయ, సినీ రంగాల్లో రాణించలేకపోయాడు. విక్రమ్ ఆలస్యంగా నోరు విప్పాడు. ఆలస్యంగా నోరు విప్పడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నాడో వారు రాష్ట్రం దాటేలా చూసుకున్న తర్వాత పెదవి విప్పాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+