విక్రమ్‌పై కాల్పులు, షాకింగ్ ట్విస్ట్: లైసెన్స్ లేని తుపాకీ, దేశవాళీ బుల్లెట్లు
మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న కారణంగా అతను ఆత్మహత్యాయత్నం నాటకం ఆడారా అనే అనుమానాలు వస్తున్నాయి.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న కారణంగా అతను ఆత్మహత్యాయత్నం నాటకం ఆడారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ దిశలో పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు.

గంటలుగా ఆధారాల సేకరణ.. అనుమానాస్పదంగా కారు
ఈ ఘటనపై పోలీసులు గంటలుగా ఆధారాల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటనను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కాల్పుల తర్వాత ఓ కారు వేగంగా, అనుమానాస్పదంగా వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

లైసెన్స్ లేని పిస్తోలు, 7.69 తుపాకీ బుల్లెట్లు
కాల్పులు జరిగిన పిస్తోలుకు లైసెన్స్ లేదని పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. 7.69 తుపాకీకి చెందిన బుల్లెట్లుగా గుర్తించారు. ఆ బుల్లెట్లు దేశవాళీవిగా గుర్తించారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ పిస్తోలు లైసెన్స్ కోసం ఇప్పటి దరఖాస్తు చేసుకోలేదని కూడా తెలుస్తోంది.

సంఘటనపై పోలీసుల అనుమానాలు
విక్రమ్ గౌడ్ కాల్పుల సంఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం సమాచారం సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా కూడా దర్యాఫ్తు జరుపుతున్నారు. విక్రమ్ గౌడ్ ఇటీవలే తన తండ్రి ఇచ్చిన ఇంటిని అమ్మినట్లుగా అనుమానిస్తున్నారు.

వాట్సాప్ సందేశాలు
కాగా, విక్రమ్ గౌడ్ డ్రగ్ కేసు, రూ. లక్షల అప్పు భయంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే ప్రచారం జాగిన విషయం తెలిసిందే. ఆయనకు 39 కీలక వాట్సాప్ సందేశాలు వచ్చాయి. కీలకమైన వాట్సాప్ సందేశాలను తన భార్య ఫోన్ డేటాకు అతను పంపించాడు. అయితే, అప్పుల్లో కూరుకుపోవడంతో ఆత్మహత్యాయత్నం నాటకం ఆడారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications