
మునుగోడులో వైఎస్సార్ ప్రసంగంతో - మద్దతుదారుల ఓటు ఎటు..!!
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో రాజకీయ కాక పెంచుతోంది. నవంబర్ 3న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇందుకోసం ముూడు జాతీయ పార్టీల నుంచి ముఖ్య నేతలు దిగి వస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రేపు బీజేపీ కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి నేతలంతా రాహుల్ పాదయాత్రలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్రతీ ఓటు ఇక్కడ కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ప్రచారంలో ఆసక్తి కర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
మునుగోడులో వైఎస్సార్ దిగి వచ్చి ప్రచారాం చేస్తున్నారనే తరహాలో ఇప్పుడు ఆసక్తి కర సన్నివేశం కనిపించింది. వైఎస్సార్ తరహాలో ఆహభావాలు..వైఎస్సార్ స్వరంతో ప్రచారం ఇప్పుడు మునుగోడులో ప్రత్యేకార్షణగా నిలుస్తోంది. అయితే, వైఎస్సార్ పోలికలతో ఉన్న వ్యక్తి నమస్తే..నమస్తే.. నమస్తే అంటూ బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ మద్దతు దారులు.. వైఎస్సార్ అభిమానులను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తరువాత రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ జిల్లాలో వైస్సార్ అనుచరులుగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. అదే విధంగా 2009 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేసారు.

వైఎస్సార్ కు కోమటిరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం గుర్తు చేయటానికే ఈ రకంగా వైఎస్సార్ మాట్లాడే స్వరంతో ఇప్పుడు గ్రామ గ్రామాన ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ ప్రచారాన్ని వైఎస్సార్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత కాలం, వైఎస్సార్ అభిమానులు ఆయనతోనే నడిచారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరటం.. వైఎస్సార్ కుమార్తె షర్మిల కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా..మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవటంతో వారి ఓట్లు ఎవరికి పోలవుతాయనేది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.
మునుగోడు లో వైఎస్ఆర్ వేషధారణతో ఉన్న వ్యక్తితో ప్రచారం చేయిస్తున్న బీజేపీ pic.twitter.com/gyxFF7gG7R
— oneindiatelugu (@oneindiatelugu) October 30, 2022