వైరల్ వీడియో: యూరియా కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
Viral Video: రాష్ట్రంలో ఇప్పటివరకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో జుట్లు పట్టుకుని కొట్టుకుని మహిళలు.. తాజాగా యూరియా కోసం యుద్ధాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా జట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యూరియా కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులు పరస్పరం గొడవపడ్డారు. మహబూబాబాద్‌లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం వచ్చిన ఇద్దరు మహిళల మధ్య ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు. వారిని తోటి రైతులు అతి కష్టం మధ్య అడ్డుకుని విడిపించారు. గత నెలరోజులుగా యూరియా కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు సహనం కోల్పోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
యూరియా కోసం కొట్టుకున్న మహిళలు
— Sanjay Journalist (@SanjuJournalist) September 5, 2025
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ . దీంతో నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని, చెప్పులతో కొట్టుకున్న మహిళలు.#Mahaboobabad #urea pic.twitter.com/H6184v1v5z
గ్రోమోర్ సెంటర్‌పై రైతులు దాడి
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల సమస్య ఎక్కువ కావడంతో రైతులు సహనం కోల్పోతున్నారు. చాలా ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు యూరియా కొరతపై ఆందోళనలు చేపట్టారు. మహబూబాబాద్‌లో గ్రోమోర్ సెంటర్ పై అన్నదాతలు దాడి చేశారు. క్యూలో నిల్చున్నవారికి మధ్యాహ్న తర్వాత యూరియూ ఇస్తామని సిబ్బంది చెప్పడంతో రైతులు అక్కడ ఉన్నారు. కానీ వారు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రైతులు గోదాంపై దాడి చేసి యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. యూరియా స్టాక్ ఉన్నప్పటికీ విక్రయించలేదని అన్నదాతలు మండిపడ్డారు. గ్రోమోర్ కేంద్రం ముందు కర్రలు వేసి నిప్పుపెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు నచ్చజెప్పి గోదాంలో స్టాక్ ను రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు.

క్యూలైన్లలో రైతులు
కనీసం ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందో లేదోనని తెల్లవారుజాము నుంచే రైలు క్యూలైన్లలో నిల్చుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు యూరియా ఒక్క బస్తా కూడా లభించకపోవడంతో రైతులు రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సింగిల్ విండో సొసైటీ వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్లలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధులు కళ్లుతిరిగి కిందపడిపోయారు. దీంతో పక్కన ఉన్న రైతులు వాళ్లకు నీళ్లు తాగించి 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సింగిల్ విండో కార్యాలయానికి కూడా అన్నదాతలు ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన యూరియా లారీని అధికారులు అక్కన్నపేటకు పంపడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న మంత్రి కార్యాలయానికి పరుగులు తీశాపు. పోలీసులు వారించినా రైతులు వినకుండా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్చారు. ఈ ఘటనలే కాకుండా చాలా జిల్లాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు జరిగాయి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి రాష్టంలో యూరియా కొరత లేదని .. కేవలం పంపిణీ సమస్యలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఈ పంపిణీ సమస్యలు నియంత్రించడంలో కూడా సర్కారు విఫలమవుతోంది. రైతులకు సరైన సమాచారం అందించడంలో కూడా విఫలమవుతోందని చాలా మంది మండిపడుతున్నారు. రైతులకు ఎరువులు అందించని ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications