ట్రాక్ పైకి ఎద్దు..! విశాఖ-హైదరాబాద్ వందే భారత్ కు తప్పిన పెను ప్రమాదం..!

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఇవాళ పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ రైలు తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న తర్వాత అనుకోకుండా ఓ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తంగా ఉన్న లోకో పైలట్ సడన్ గా రైలు వేగాన్ని నియంత్రించారు. ఈ నేపథ్యంలో రైలుకు అనూహ్యంగా ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ప్రయాణికులు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

ఇవాళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. అనంతరం తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ పైకి ఒక్కసారిగా ఎద్దు రావడంతో భారీ వేగంతో ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో లోకో పైలట్లు వెంటనే స్పందించి రైలును నిలిపేశారు. స్థానిక స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ట్రాక్ ను క్లియర్ చేశారు.

visakhapatnam-hyderabad vande bharat express narrowly escaped accident after bull s sudden entry

ఈ ఘటనలో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. దానికి వెంటనే మరమ్మత్తులు చేసే వీలు లేకపోవడంతో అలాగే రైలును అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింది. ఈ అనూహ్య ఘటనతో మహబూబాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ట్రాక్ పై నుంచి ఎద్దును క్లియర్ చేసిన తర్వాత తిరిగి రాకపోకల్ని అధికారులు అనుమతించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+