వైఎస్ బూట్లు నాకాలేదు: అరుణపై మంత్రి తీవ్ర వ్యాఖ్య

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు గందరగోళం ఏర్పడింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సభ్యులు క్షమాపణ కోసం డిమాండ్ చేశారు. దీంతో సభను వాయిదా వేశారు.

ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్‌ మధుసూదనాచారి విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

 War of words between Aruna and Jagadeeswar Reddy

జగదీశ్వర్ రెడ్డి తొలిసారి గెలిచారని, మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన జగదీశ్ చాలా నేర్చుకోవాలని డీకే అరుణ అన్నారు. దీనిపై జగదీశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించాడు. మీలా వైయస్ బూట్లు నాకి మంత్రి పదవులు తెచ్చుకోలేదని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ కూడా మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు అభ్యంతరకరం అనిపిస్తే రికార్డ్స్ నుండి తొలగించవచ్చని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అయితే క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ సభను వాయిదా వేశారు.

కాంగ్రెస్ పైన హరీష్ భగ్గు, టీడీపీ నేతలతో పిచ్చాపాటీ

కాంగ్రెస్ పార్టీ నేతలకు అవినీతి పైన మాట్లాడే హక్కు లేదని హరీష్ రావు అన్నారు. సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగేది కాంగ్రెస్ నేతలే అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చరిత్ర అందరికీ తెలుసునన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. మైక్ ఇస్తామని చెప్పినప్పటికీ సభ్యులు పోడియంలోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.

అసెంబ్లీ బయట హరీష్ రావు తెలంగాణ టీడీపీ నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో మాదిరిగా తాము ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు గెంటేయలేదన్నారు. తప్పు చేశామని లేఖ రాస్తే తాము సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+