మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉపఎన్నికకు ముహూర్తం ఖరారైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మే 2న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 9 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు ఉంది. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీగా ఏర్పడిన స్థానంలో ఈ ఉపఎన్నిక జరుగుతోంది.

Warangal khammam nalgonda Graduate MLC by Election schedule released

ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన కావడంతో మే 27న పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, 2021లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. గతంలో బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసి జైలుకు కూడా వెళ్లిన విషయంతెలిసిందే.

పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని పట్టభద్రులు ఓటర్ల నమోదు చేసుకునే గడువు పూర్తయింది. దీంతో తాజాగా తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. కాగా, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించగా, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+