Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ పీజీ వైద్యవిద్యార్థిని ఆరోగ్యం విషమం; కేఎంసీ ముందు విద్యార్ధిసంఘాల ఆందోళనతో ఉద్రిక్తత!!

వరంగల్ పీజీ వైద్య విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థి సంఘాల నిరసనతో కేఎంసీ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వైద్యుల వేధింపులు తట్టుకోలేక వైద్యురాలు, పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వేధింపులు భరించలేక ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా, ప్రిన్సిపల్ సదరు సీనియర్ వైద్యులను మందలించినప్పటికీ, గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారో అన్నా ఆందోళనతో మనస్థాపానికి గురైన పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధుల్లో ప్రీతి

ఎంజీఎం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధుల్లో ప్రీతి

జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా కు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్లోని ఆర్పిఎఫ్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరి కుటుంబం హైదరాబాద్ లో సెటిలైంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలుండగా చిన్న కుమార్తె ప్రీతి ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని కేఎంసీలో అనస్థీషియా పీజీ కోర్సులో చేరింది. అనస్తీషియా విభాగం డ్యూటీ చార్ట్ లో భాగంగా ఎంజీఎం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో కొంత కాలంగా విధులు నిర్వర్తిస్తోంది.

సీనియర్ వైద్యుడి వేధింపులతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు, ఆపై ఆత్మహత్యా యత్నం

సీనియర్ వైద్యుడి వేధింపులతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు, ఆపై ఆత్మహత్యా యత్నం

అయితే ఎంజిఎం ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న క్రమంలో పరిచయమైన సీనియర్ వైద్యుడు సైఫ్ తనను వేధిస్తూ ఉండడంతో ప్రిన్సిపల్ మోహన్ దాస్ కు పిర్యాదు చేసింది ప్రీతి. ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు అనస్థీషియ విభాగాధిపతి డాక్టర్ నాగార్జున రెడ్డి సైఫ్, ప్రీతిలను ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.

హానికరమైన ఆ ఇంజక్షన్ తో .. ప్రీతి పరిస్థితి విషమం

హానికరమైన ఆ ఇంజక్షన్ తో .. ప్రీతి పరిస్థితి విషమం

ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ 50 ఎంజి ఇంజక్షన్ తీసుకున్న ప్రీతి ఆత్మహత్య చేయడానికి పాల్పడడంతో వెంటనే ఆమెకు తోటి వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియులో వెంటిలేటర్ పైన ప్రీతికి చికిత్స కొనసాగుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అవయవాలు దెబ్బ తినడంతో పాటు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయినట్టుగా వైద్యులు చెబుతున్నారు.

కేఎంసీ వద్ద విద్యార్ధి సంఘాల ఆందోళన

కేఎంసీ వద్ద విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇదిలా ఉంటే పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి వరంగల్ కేఎంసీలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నేడు కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు మెడికల్ కళాశాల ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రీతి పై వేధింపులకు పాల్పడిన సీనియర్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత


ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, ఈ ఘటనపై హై లెవెల్ కమిటీతో విచారణ చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కళాశాల లోపలికి వెళ్లకుండా గేట్లు లాక్ చేయడంతో గేట్లు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలోని విద్యార్థి సంఘం నాయకులు కళాశాలలోకి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+