టెన్త్ క్లాస్ ఫలితాల్లో వరంగల్ ఫస్ట్, ర్యాంకులొద్దు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదివారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 77.56 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు ముందంజలో ఉన్నారు. వరంగల్‌ జిల్లా 91.6 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ‌88 శాతంతో ఉంది.

మూడో స్థానంలో మెదక్‌ జిల్లా 87 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక ఆదిలాబాద్‌ జిల్లా 54.9 శాతం చివరి స్థానంలో నిలిచింది. బాలికల ఉత్తీర్ణత శాతం 79.04గా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 76.11గా ఉంది.

Warangal Tops in Telangana 10th Results 2015

జూన్‌ 18 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సప్లిమెంటరీ ఫరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేది మే 30గా నిర్ణయించారు. ఈ ఏడాది 28 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఫలితాలు సాధించడం విశేషం.

ఫలితాలు విడుదల చేసిన సమయంలో మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ... ప్రయివేటు పాఠశాలలు టీవీలు, పత్రికల్లో ర్యాంకుల ప్రకటనలు ఇవ్వవద్దని సూచించారు. ప్రయివేటు పాఠశాలలు ర్యాంకులు ప్రకటిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+