గోవా వెళ్ళే ఏపీ, తెలంగాణా ప్రజలకు హెచ్చరిక!

గోవా.. భారతదేశంలోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం. సముద్ర అందాలతో, ఆహ్లాదపరిచే బీచ్ లతో ముఖ్యంగా కుర్రకారుకు ఆనందాన్ని పంచే గోవా వెళ్లడానికి చాలామంది ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆటపాటలతో ఎంజాయ్ చేయడానికి, క్యాసినో ఆడడానికి, మందు పార్టీలు చేసుకోవడానికి గోవాని రైట్ ప్లేస్ గా చాలామంది భావిస్తారు.

గోవా వెళ్తే జాగ్రత్త
అయితే అందాల గోవాలో ఇవి మాత్రమే కాదు అంతర్జాతీయ డ్రగ్ గ్యాంగులు కూడా ఉన్నాయి అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. గోవా వెళ్లే వారు కొన్ని విషయాలలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరమైన రిస్కులలో పడాల్సి వస్తుంది. ఇంతకీ గోవా వెళుతున్న వారి గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అంటే..

Warning to the tourists of AP and Telangana who are going to Goa

గోవాలో క్యాబ్ డ్రైవర్ లతో జాగ్రత్త
ఇటీవల కాలంలో గోవా కి వెళ్ళొచ్చిన పర్యాటకులు సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ వారి ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతున్నారు. గోవా కి వెళ్ళిన వారు జాగ్రత్తగా ఉండాలని లేదంటే మోసం చేసే వాళ్ళు నిలువు దోపిడీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అక్కడ క్యాబ్ డ్రైవర్ ల తీరు వచ్చిన పర్యాటకులను దోచుకునే విధంగానే ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

మోసం చేసే గ్యాంగులు.. నిలువు దోపిడీ
ఇటీవల మహారాష్ట్రకు చెందిన 11 మంది పర్యాటకులు గోవాకు వెళ్లి బసచేశారు. అయితే ఆ ప్రాంతానికి గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు వెళ్లి వారందరికీ తక్కువ ధరకు భోజనం అందిస్తామని చెప్పి వారిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్లారని ఆపై వారిని దోచుకున్నారని సోషల్ మీడియాలో లబోదిబోమన్నారు. మరొకరు బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారికి డ్రగ్స్ ఆశ చూపి కొకైన్ ఇస్తానని చెప్పి రెండు లక్షలు తీసుకొని పారిపోయినట్టుగా కూడా సమాచారం.

మద్యం, డ్రగ్స్ తో జాగ్రత్త
ఇక గోవా వెళ్లేవారు మితిమీరిన మద్యం సేవించడం, మితిమీరిన మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో ఒక్కొక్కసారి ప్రాణాలనే ప్రమాదంలోకి తోసుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు. విపరీతంగా మద్యం సేవించి మాదకద్రవ్యాలు తీసుకొని శరీరం డిహైడ్రేషన్ కి గురై చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక అంతేకాదు గోవాలో ఎవరైనా స్థానికేతరులు అక్కడ ఉన్నవారికి ఎదురు తిరిగి మాట్లాడితే వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారని కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు బీ కేర్ ఫుల్
తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి పర్యాటకులు పెద్ద ఎత్తున వెళుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గోవా వెళ్లేవారు జాగ్రత్తగా మెలగాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడ పోలీసులకు తక్షణ సమాచారం అందించాలని సలహా ఇస్తున్నారు. గోవా భారతదేశంలోని అందమైన పర్యాటక ప్రదేశం ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు అంటున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+