ట్విస్ట్: విజయ్ మృతిపై భార్య వనితా అనుమానం, 'ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సెల్ఫీ వీడియో'

హైదరాబాద్: తెలుగు సినిమా హస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు.అయితే విజయ్ సాయి ఆత్మహత్యపై భార్య వనితారెడ్డి కూడ అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

హైద్రాబాద్ మియాపూర్‌లోని తన అపార్ట్‌మెంట్లో తెలుగు సినిమా నటుడు విజయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఈ ఆత్మహత్య విషయంలో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకొన్నాయి.

అయితే చనిపోయే ముందు విజయ్ సాయి సెల్పీ వీడియోను రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే విజయ్ సాయి సెల్పీ వీడియోలో తన భార్యతో పాటు కొందరిపై ఆరోపణలు గుప్పించారు.

అన్ని కోణాల్లో విచారణ

అన్ని కోణాల్లో విచారణ

సినీ నటుడు విజయ్ సాయి కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు ప్రకటించారు. వెంకటేశ్వర్‌రావు సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడారు. శశిధర్‌తో పాటు అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు భార్య వనితపై చనిపోయే ముందు విజయ్ సెల్పీ వీడియో తీసుకొన్నారు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌ విజయ్ సాయి వీడియో

ఫోరెన్సిక్ ల్యాబ్‌ విజయ్ సాయి వీడియో

చనిపోయే ముందు విజయ్ సాయి తీసుకొన్న సెల్పీ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నట్టు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు చెప్పారు. అయితే విజయ్ సాయి చేసిన ఆరోపణలో వాస్తవాలను తేల్చనున్నట్టు వెంకటేశ్వర్ రావు చెప్పారు.

విజయ్ కు బ్లాక్ మెయిల్స్

విజయ్ కు బ్లాక్ మెయిల్స్

అయితే కొన్ని వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని డీలీట్ చేయాలంటే తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ విజయ్ సాయికి అడ్వకేట్ శ్రీనివాస్ బ్లాక్ మెయిల్ చేశారని విజయ్ ఆరోపణలు చేశారు. అయితే వనితా రెడ్డి చూసిన వీడియోలు అడ్వకేట్ వద్దకు ఎలా వచ్చాయనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నట్టు చెబుతున్నారు.అయితే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మానసికంగా వేధింపులకు గురి చేశారని విజయ్ ఆరోపణలు గుప్పించారు.

భార్య, భర్తల మద్య గొడవలు

భార్య, భర్తల మద్య గొడవలు

భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవలు కోర్టు కేసుల వరకు వెళ్ళాయని డీసీపీ వెంకటేశ్వర్ రావు చెప్పారు. అయితే ఈ గొడవలు కూడ విజయ్ ఆత్మహత్యకు కారణమా, ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేయనున్నట్టు డీసీపీ చెప్పారు.

విజయ్ సాయి ఆత్మహత్యపై వనితా అనుమానాలు

విజయ్ సాయి ఆత్మహత్యపై వనితా అనుమానాలు

విజయ్ సాయి ఆత్మహత్యపై ఆయన భార్య వనితా రెడ్డి ఆనుమానాలు వ్యక్తం చేశారు. తన భర్త విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదన్నారు. అయితే ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అర్ధంకావడం లేదన్నారు. రెండేళ్ళుగా ఆత్మహత్య చేసుకోకుండా ఇప్పుడే ఎందకు ఆత్మహత్య చేసుకొన్నాడో చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. విజయ్‌కు ఆయన తండ్రికి మధ్య గొడవలున్నాయని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.

చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలా

చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలా

చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని విజయ్ తండ్రి సుబ్బారావు ప్రకటించారు. వనితా కేసు విషయమై రాజీ పేరుతో అడ్వకేట్ విజయ్ వద్దకు వచ్చేవాడని సుబ్బారావు చెబుతున్నారు.కోర్టు కేసులో ఉన్న సమయంలో ఆరోపణలు ఎందుకు చేయలేదని సుబ్బారావు ప్రశ్నించారు. ఆర్థికపరంగా ఏనాడూ తమకు ఇబ్బందులేవని విజయ్ తండ్రి చెప్పారు. బంగారం, డబ్బును చెప్పకుండానే వనిత తమ ఇంట్లో నుండి తీసుకెళ్ళేదని విజయ్ తండ్రి సుబ్బారావు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+