తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూసి గర్వపడుతున్నా.. కాని ఒక్కటే బాధ.. : కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 91 లోకసభ నియోజకవర్గాలకు తొలి విడతలో భాగంగా గురువారం పోలింగ్ జరిగింది. తెలంగాణలో ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటలలోపు క్యూలైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత వస్తే మాత్రం ఈ అవకాశం ఉండదు. అయితే ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది.
దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. ఇప్పటి వరకు ఎవరైతే ఓటు వేయలేదు, వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని, అసలు మన ప్రభుత్వం మెజార్టీ వల్ల రాలేదని, ఎక్కువ మంది ఓటు వేయడం వల్ల ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పటికే తెలంగాణలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది. దీంతో ఆయన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ట్వీట్ చేశారు.
I am proud of the way Telangana conducted itself today in this important parliament election🤘👍
— KTR (@KTRTRS) April 11, 2019
Proud of the administrative machinery, EC & Govt officials, political party workers of All parties & above all the people of Telangana🙏🙏
Only let down was the low turnout in towns

తెలంగాణలో లోకసభ ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఈసీ, ప్రభుత్వ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు, ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించారు. కానీ ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమే ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు.
కాగా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ రోజు జరిగింది. మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తెలంగాణలో 48.95 శాతం పోలింగ్ నమోదైంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications