Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డికి జోగు రామన్న వార్నింగ్-పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాళ్లు,చేతులు నరికేస్తాం

ఒకనాటి ఆదిలాబాద్ పోరాటాల చరిత్రను టీఆర్ఎస్ మార్చివేసిందని... ఇప్పుడు ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న,గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి,టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న తాజాగా ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాళ్లు,చేతులు నరికి పంపిస్తామని హెచ్చరించారు. ఖబడ్దార్ రేవంత్ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు,రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలేవీ లేవని... అక్కడ పథకాలు పెట్టడం చేతకానివాళ్లు ఇక్కడేదో చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఉన్నాయా...

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఉన్నాయా...

'దళిత గిరిజన దండోరా.. మీదేమీ కొత్త పార్టీ కాదు... దేశాన్ని,రాష్ట్రాన్ని దాదాపు 55 ఏళ్లు మీరే పాలించారు.ఇప్పుడు మీ మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఆదివాసీలకు,దళితులకు కేసీఆర్ ఏమీ చేయలేదని... రేపు మేము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ మోసపూరిత మాటలు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్ని గ్రామాలకు రోడ్లు వేశారు... తెలంగాణ వచ్చాక ఎన్ని గ్రామాలకు రోడ్లు వేశారో వచ్చి చూడండి. గతంలో ఎన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చారు.. ఇప్పుడెన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ది చేస్తున్నారో చూడండి. మమ్మల్ని ప్రశ్నించే ముందు.. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్,రాజస్తాన్,చత్తీస్‌గఢ్‌లలో దళిత బంధు,రైతు బంధు లాంటి పథకాలు అమలవుతున్నాయా చెప్పండి. అక్కడ రూ.3116,రూ.2116 ఫించన్లు ఎందుకు అమలుచేయట్లేదో చెప్పండి. మీరు దళిత బంధుకు వ్యతిరేకమా అని ప్రశ్నిస్తున్నాం. వ్యతిరేకమైతే చెప్పండి.' అని జోగు రామన్న విరుచుకుపడ్డారు.

నాగోబా జాతరను కాంగ్రెస్ పట్టించుకోలేదు...

నాగోబా జాతరను కాంగ్రెస్ పట్టించుకోలేదు...

'దేశ,విదేశాల నుంచి ఎంతోమంది నాగోబా జాతరకు వస్తుంటారు... కాంగ్రెస్ పాలనలో ఆ జాతర,గుడి గురించి ఏనాడు పట్టించుకోలేదు... టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ గుడిని రూ.6కోట్లుతో అభివృద్ది చేసింది.అది మాత్రమే జోడెన్ ఘాట్‌తో పాటు సదన్‌పూర్‌లోని భైరన్ దేవ్ ఆలయాన్ని కూడా రూ.2కోట్లతో ప్రభుత్వం అభివృద్ది చేసింది. మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా ఆదివాసీ,గిరిజనులు ఆ గుడికి వస్తుంటారు. కాంగ్రెస్ దాన్ని ఏనాడు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేలా ఉన్నాయి. పోడు భూముల సమస్య గురించి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి... సీఎస్‌ను పిలిపించి అప్పటికప్పుడు పోడు సమస్యను పరిష్కరిస్తామన్నారు. కరోనా వల్ల అది ఆలస్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు 100 శాతం ఆదివాసీ,గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది.' అని జోగు రామన్న స్పష్టం చేశారు.

వంద శాతం పోడు సమస్యను పరిష్కరిస్తాం...

వంద శాతం పోడు సమస్యను పరిష్కరిస్తాం...

'కాంగ్రెస్ డిమాండ్ చేస్తేనే కేసీఆర్ పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చారని చెప్పుకునేందుకే ఇంద్రవెల్లిలో సభ పెట్టారు. పట్టలు పగలు దొరికిన దొంగ రేవంత్... జైలుకు పోయివచ్చినోడివి... అదే జైలుకు పోయి వచ్చిన బీజేపీ ఎంపీతో చీకటి ఒప్పందం చేసుకుని ఈ సభ జరిపారు. కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయి. రేవంత్ ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే... కాళ్లు,చేతులు నరికి పంపిస్తాం.' అని జోగు రామన్న హెచ్చరించారు.

రేవంత్ మాటల తూటాలు...

రేవంత్ మాటల తూటాలు...

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సోమవారం(అగస్టు 9) కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. పనిలో పనిగా ఉమ్మడి జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 'పోరాటాల చరిత్ర ఉన్న ఆదిలాబాద్‌‌ను టీఆర్ఎస్‌ మార్చేసింది.. ఇప్పుడు ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న, గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్... వీళ్లు ఈ జిల్లాకు పట్టిన చీడ.. ఆదివాసీ, దళితుల కోసం సభ పెడితే పోలీసులు అడ్డుకోవడం తగునా.. ఈ సభలో లక్షకు ఒక్క తల తక్కువగా ఉంటే నా తల వంచుతా.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క... సీఎం కేసీఆర్ ను బొంద పెడుతా.. మరో 20 నెలల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైలే గతి.. అసలుకు మిత్తితో సహా చెల్లిస్తాం' అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

రావుల రాజ్యంతో దళిత గిరిజనులకు న్యాయం జరగదని...

రావుల రాజ్యంతో దళిత గిరిజనులకు న్యాయం జరగదని...

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు రేవంత్ రెడ్డి. సన్నాసి బాల్క సుమన్... కాంగ్రెస్ ఏమి చేసిందని అడుగుతున్నాడంటూ ఫైర్ అయ్యారు.నువ్వు రిజర్వేషన్ సీటులో ఎమ్మెల్యే, ఎంపీ కావడానికి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలి.. అప్పుడే దళిత బంధు లాంటి పథకాలు వస్తాయన్నారు. అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరి మీద అప్పు మోపిన ముఖ్యమంత్రి.. నరరూప రాక్షసుడుగా మారాడు... కొడుకును టాటాను చేసాడు... బిడ్డను బిర్లాను... అల్లుడిని అంబానీ చేసాడని ఎద్దేవా చేశారు. తాను ఇంకో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని.. ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు తల్లి అంటే సోనియమ్మనే అన్నారు.. ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.అదే సమయంలో కేసీఆర్ ఇంట్లో వాళ్ల ఆస్తులు పెరిగాయన్నారు. రావుల రాజ్యంలో దళిత గిరిజనులకు ఏమి రావు అన్నారు.

ఆ బాధ్యత కాంగ్రెస్‌దే : రేవంత్

ఆ బాధ్యత కాంగ్రెస్‌దే : రేవంత్

ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకెళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుందన్నారు. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉందని.. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పొరు చేసిన గడ్డ ఇది అని గుర్తుచేశారు. అటువంటి వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన ఆదివాసీ బిడ్డల పేర్లను స్మారక శిలాఫలకంపై లిఖిస్తామన్నారు. నాడు ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే భాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+