తెలంగాణలో ఒకే కుటుంబానికి అధికారం: రాహుల్, కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన బస్సు యాత్రలో రాహుల్ మాట్లాడారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని కాబట్టే.. ఎన్నో కేసులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని.. అందుకే ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై విచారణ ఏదీ అని ప్రశ్నించారు.
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఎంఐఎం ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించారు రాహుల్. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పాలన ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో కుల గణన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ మాట్లాడారు. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని విమర్శించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందన్నారు. త్వరలో తెలంగాణలో రైతులు, పేదల ప్రభుత్వం రాబోతోందన్నారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకు పంచుతామన్నారు.

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి : బీజేపీకి దూరమైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రాహుల్.
Shri @RahulGandhi addressed a corner meeting in Peddapalli, Telangana.
— Aman Gandhi (@Aman_Gandhi_IN) October 19, 2023
The people of Telangana will vote for progressive and inclusive leadership!
मेरे बड़े भाई राहुल गांधी जी हमें भी अपने साथ रखो 🙏
मेरी बहन प्रियंका गांधी जी जिंदाबाद
मेरी मम्मी सोनिया गांधी जी जिंदाबाद
मेरे… pic.twitter.com/ioActNqKpH
నర్సంపేట టికెట్ ను ఇప్పటికే దొంటి మాధవ రెడ్డికి కేటాయించడంతో రేవూరి ప్రకాశ్ రెడ్డి.. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల టికెట్ ఇస్తే.. అక్కడ్నుంచి టికెట్ ఆశిస్తున్న కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications