ఔరంగజేబు సమాధిని కూల్చేసి సముద్రంలో పడేస్తాం - ఎమ్మెల్యే రాజా సింగ్

విక్కీ కౌశల్, రష్మిక నటించిన చిత్రం 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. భారీ హిట్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు సహా పలు భాషల్లో ప్రేక్షక ఆదరణ పొందింది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన నాటి నుంచి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం దేశ వ్యాప్తంగా వివాదానికి తెరలేపింది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఔరంగజేబ్ సమాధిని కూల్చి వేస్తామని, సముద్రంలో పడేస్తామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళతారని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని రాజాసింగ్ కోరారు.

we-will-demolish-aurangzebs-tomb-and-throw-it-into-the-sea-mla-raja-singh

వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు, కాశీ, మథుర అంశాలపై ఆధారపడతాయని చెప్పారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారని.. ఎంఐఎం ఆదేశాలతోనే ఇలా జరిగిందని మండిపడ్డారు. శోభాయాత్రకు ఈసారి దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు. ఈ వరుస వివాదాల నేపధ్యంలో మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఇష్యూ సున్నితమైన అంశం కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

'ఛావా' చిత్రంలో శంభాజీ మహరాజ్.. మొగలులతో చేసిన యుద్ధం, మరాఠా సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సన్నివేశాలు ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అలానే క్లైమాక్స్‌లో ఔరంగజేబు చేతిలో శంభాజీ నరకం చూసిన సన్నివేశాలు చూసి ఆడియన్స్‌ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ నిర్మించారు. ఈ సినిమాపై కామన్ ఆడియన్స్ నుంచి రివ్యూవర్ల వరకూ ఎంతో మంది సెలబ్రెటీల నుంచి రాజకీయ నాయకుల వరకూ ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+