తెలంగాణలోని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణలోని పలు జిల్లాలకు సోమవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.
రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆదివారం సాగర్ ఐలాండ్ వద్ద తుఫాన్ తీరం దాటింది.

ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు సోమవారం వర్ష కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఆ తర్వాత రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇది ఇలావుండగా, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో భారీ చెట్లు, హోర్డింగులు కుప్పకూలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో తీవ్రమైన గాలివాన కురిసింది. ఈ క్రమంలో వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లాలో 8 మంది మృతి చెందగా, శామీర్ పేటలో చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మియాపూర్ లో గొడ కూలి మూడేళ్ల బాలుడు, సిద్ధిపేట జిల్లా క్షీరసాగరలో ఇద్దరు మృతి ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications