తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
కాగా, బుధవారం హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ నుంచి క్రమక్రమంగా మొదలైన వర్షం నగరమంతటా విస్తరించింది. చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్బాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ట్యాంక్ బండ్, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, మధురానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నిజాంపేట, బాచుపల్లి, గండి మైసమ్మ, కృష్ణాపూర్, దుండిగల్, కేపీహెచ్‌బీ, మైత్రివనం, మాదాపూర్, కీసర, మల్కాజిగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, గుండ్ల పోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జగద్గిరి గుట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్‌గూడ, శ్రీకృష్ణా నగర్, పూర్ణ టిఫిన్ సెంటర్ వీధిలోని దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది.
సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్ని, పారడైజ్, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాలలోనూ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా పడుతున్న వర్షానికి రహదారులన్నీ జలమమయ్యాయి. ఏకధాటిగా కురుస్తుండడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా కురిసిన వాన నీరంతా రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.












Click it and Unblock the Notifications