Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revanth Reddy: తెలంగాణకు రూ.250 కోట్ల పెట్టుబడులు.. సీఎంతో వెల్స్పన్ గ్రూప్ భేటీ..

తెలంగాణలో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంకా నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం 'నూతన స్నేహపూర్వక విధానాన్ని' అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పెట్టుబడులను ఆహ్వానిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన అన్ని రకాల మద్దతు ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.చందన్ వ్యాలీ పారిశ్రామిక రంగంలో త్వరలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బీకే గోయెంకా తెలిపారు.టైర్ 2, 3 నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రోత్సహించడంలో భాగంగా వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

Welspun Group has come forward to invest Rs.250 crores in Telangana

సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ విష్ణురెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్‌ (కార్పొరేట్‌ వ్యవహారాలు) చింతన్‌ ఠాకర్‌, శ్రీసా భార్గవ మొవ్వా తదితరులు పాల్గొన్నారు. కాగా రేవంత్ నెల రోజుల పాలనపై ఓ న్యూస్ ఛానెల్ డిబెట్ లో పాల్గొన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతు బంధు విషయంలో పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+